Trisha Controversy : త్రిష .. ఈ పేరిప్పుడు కాంట్రవర్సీలకి కేరాఫ్ అయి కూర్చుంటుంది,మొన్నటి వరకు దళపతి విజయ్ తో ప్రేమాయణం అంటూ హైలెట్ అయిన ఈ అమ్మడు ఇపుడు మరోసారి మంటల్ని రాజేసే పనిలో పడింది.విషయంలోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్న సంగతి తెల్సిందే.
అయితే, సినిమా మే 14న రిలీజ్ అవుతున్న ఈ టైమ్ లో అనుకోని కాంట్రవర్సీ ఇపుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కృష్ణన్ చుట్టూ జరుగుతున్న ఈ హైడ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆడియో లాంచ్‌లో త్రిష మిస్సింగ్.
ఈమధ్యే ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. సూర్యతో పాటు యూనిట్ మొత్తం సందడి చేసింది. కానీ,కనిపిస్తుంది అనుకున్న త్రిష మాత్రం కనిపించలేదు. త్రిష రాకపోవడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు .”రెమ్యూనరేషన్ తీసుకుంటారు కానీ ప్రమోషన్స్‌కు రారా?” “సీనియర్ హీరోయిన్ అయి ఉండి బాధ్యత లేదా?” అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు.ఈ విమర్శల వెనుక ఉన్న అసలు నిజం త్రిష బయటపెట్టేసరికి నోరెళ్లబెట్టారు నెటిజన్లు.
also read :షూటింగ్‌లు బంద్.. కోలీవుడ్‌లో టెన్షన్ టెన్షన్!
ఇన్విటేషన్ మెయిల్‌లో మిస్ అయి ఉండొచ్చు
ఈమధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో త్రిష ‘ప్రీతి’ అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించిన సంగతి తెల్సిందే.అయితే ఒక నెటిజన్ ఆమె లుక్‌ను పొగుడుతుంటే.. త్రిష ఇచ్చిన రిప్లై ఇపుడు మీడియాలో వైరల్ అవుతోంది. “థ్యాంక్స్.. నేను కూడా ఆ పాత్ర గురించి మర్చిపోయాను. ఇప్పటికైనా గుర్తు చేసినందుకు సంతోషం” అంటూ మూవీ టీమ్ కి ఇన్ డైరెక్ట్ సెటైర్ వేసింది ఈ తమిళ చిన్నది.
అంతటితో ఆగకుండా, ఒక సూర్య అభిమాని “ఆడియో లాంచ్‌కు ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించగా.. “నా ఇన్విటేషన్ మెయిల్‌లో మిస్ అయి ఉండొచ్చు” అని ఏకంగా పెద్ద బాంబునే పేల్చింది. అంటే, ఈ మెగా ఈవెంట్‌కు ఆమెకు అసలు ఆహ్వానమే అందలేదన్నమాట!
మేకర్స్ తీరుపై మండిపడుతున్న అభిమానులు
దీంతో త్రిష లాంటి స్టార్ హీరోయిన్‌కు ఆడియో లాంచ్‌కు ఆహ్వానం పంపకపోవడం ఏంటి తెగ ఫైర్ అవుతున్నారు త్రిష ఫ్యాన్స్ . పోస్టర్లపై పేరు కావాలి.. కాని ఈవెంట్‌కి ఆమె వద్దు! అంటూ మేకర్స్‌ను చెడుగుడు ఆడేస్తున్నారు.ఒక స్టార్ స్టేటస్ ఉన్న నటిని ప్రమోషన్స్ నుంచి కావాలనే పక్కన పెట్టడం వెనుక ఉన్న పాలిటిక్స్ ఏంటో వారే బయటపెట్టాలి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.
సినిమాపై ప్రభావం చూపిస్తుందా?
ఒకరకంగా చూస్తె మే 14న సినిమా రిలీజ్ పెట్టుకుని, హీరోయిన్‌తో ఇలాంటి గొడవలు పెట్టుకుంటే అది మేకర్స్ కే మైనస్ . ఇప్పటికే ‘వీరభద్రుడు’గా తెలుగులో కూడా క్రేజ్ ఉన్న ఈ సినిమాకు, ఈ నెగెటివ్ పబ్లిసిటీ ఒకరకంగా ఊహించని షాకే.మరి ఈ ఇష్యూపై డైరెక్టర్ ఆర్జే బాలాజీ లేదా ప్రొడక్షన్ హౌస్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.
త్రిషకు నిజంగానే ఇన్విటేషన్ పంపడం మర్చిపోయారా? లేక కావాలనే దూరం పెట్టారా? అనేది ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో మిస్టరీగా మారింది. చూడాలి మరి ఈ త్రిష వ్యవహారం సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో !
also read :గాయపడ్డ సింహం గర్జించలేదు.. జెట్లీ స్పీడ్ అందుకోలేదు.. మే తొలివారం డిజాస్టర్?