E-Paper
Advertisement

Swayambhu: రెండు భాగాలుగా నిఖిల్ స్వయంభు..అసలు విషయం లీక్ చేసిన హీరో!

Swayambhu: రెండు భాగాలుగా నిఖిల్ స్వయంభు..అసలు విషయం లీక్ చేసిన హీరో!
Advertisement

Swayambhu: నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్ (Nikhil)తనని తాను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతున్నారు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈయన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు . ఈ సినిమా అనంతరం నిఖిల్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక త్వరలోనే నిఖిల్ నటించిన స్వయంభు (Swayambhu)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేసుకున్నారు.

ఆకట్టుకున్న టీజర్..

ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో తిరిగి ఈ సినిమాని ఏప్రిల్ 10వ తేదీ విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెల్లడించడం లేదు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే చిత్రబృందం కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్వయంభ సినిమా సీక్వెల్..

Advertisement

ఇక టీజర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యిందంటే తప్పనిసరిగా సీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిఖిల్ స్వయంభూ సినమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని హీరో నిఖిల్ ఈ సందర్భంగా తెలియజేశారు

యోధుడిగా నిఖిల్..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా నిఖిల్ నటి నభా నటేష్ (Nabha Natesh)పాత్ర గురించి మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నభా నటేష్ పాత్ర మొదటి భాగంలో మాత్రమే కాకుండా సెకండ్ పార్ట్ లో కూడా ఆమె క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుందంటూ ఈయన తెలియజేశారు. నిఖిల్ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని నిఖిల్ స్వయంగా తెలియజేశారని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 10న రాబోతోందని సమాచారం మరి రెండో భాగం ఎప్పుడు వస్తుంది ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.పిక్సెల్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించబోతున్నారు ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) కూడా హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు.

Also Read: Toxic film: మరో వివాదంలో యశ్ టాక్సిక్.. నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×