E-Paper
Advertisement

Top Soundbars for Feb 2026: బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్.. 2026లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ సౌండ్‌బార్స్ ఇవే!

Top Soundbars for Feb 2026: బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్.. 2026లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ సౌండ్‌బార్స్ ఇవే!
Advertisement

Top Soundbars for Feb 2026: మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్న సౌండ్‌బార్ కోసం వెతుకుతున్నారా? మీ ఇంట్లో టీవీ చూసే ఎక్స్‌పీరియన్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని ఉందా? ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తున్నప్పుడు మరింత ఫన్ కోరుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మార్కెట్‌ను ఊపేస్తున్న కొన్ని బెస్ట్ సౌండ్‌బార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Sonos Arc Ultra

అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్‌గా ఉండే సౌండ్‌బార్ కావాలనుకుంటే.. కళ్లు మూసుకుని Sonos Arc Ultraని ఎంచుకోవచ్చు. ఇది కేవలం సౌండ్ మాత్రమే కాదు, మంచి 3D ఆడియోను, మంచి బేస్‌ను ఇస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు సౌండ్ మన చుట్టూ ఉన్నట్లు, ఏదో థియేటర్‌లో కూర్చున్నట్లు ఓ అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది.

Samsung HW Q990F

Advertisement

శాంసంగ్‌ నుంచి వచ్చిన ఈ మోడల్‌లో 11.1.4 ఛానెల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని క్యూ సింఫనీ టెక్నాలజీ, గేమర్స్ కోసం ఇచ్చిన HDMI 2.1 సపోర్ట్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్. హై ఎండ్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

JBL Bar 1300X MK2

భారీ సౌండ్, గుండెల్లో దడ పుట్టించే బేస్ కావాలంటే మాత్రం JBL Bar 1300X MK2 కొనుగోలు చేయండి. దీనికో స్పెషాలిటీ ఉంది.. ఇందులోని వెనుక స్పీకర్లను విడదీసి మనకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. పైగా ఇందులోని 12 అంగుళాల సబ్‌వూఫర్ మీ ఇంటిని ఒక చిన్న థియేటర్‌లా మార్చేస్తుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో యాపిల్, గూగుల్ మధ్య అసలైన పోటీ.. ఏ ఫోన్ కొనడం బెటర్?

Bose Smart Ultra Soundbar

తక్కువ ప్లేస్ ఆక్రమించే, స్మార్ట్ ఫీచర్లు ఉన్న సౌండ్‌బార్ కావాలంటే Bose ఉత్తమం. ఇది కేవలం 70 సెంటీమీటర్లే ఉంటుంది కానీ, ఇచ్చే అవుట్‌పుట్ మాత్రం అదిరిపోతుంది. అలాగే దీనిలో AI టెక్నాలజీ ఉండటంతో మన రూమ్‌ని బట్టి ఆడియోను అడ్జస్ట్ చేసి ఎక్కడ కూర్చున్నా సౌండ్ క్లియర్‌గా వినిపించేలా చేస్తుంది.

Samsung HW Q800F

సినిమాల్లో డైలాగ్స్ చాలా స్పష్టంగా వినిపించాలనుకునే వారికి ఈ సౌండ్‌బార్ బాగా సెట్ అవుతుంది. దీనిలో వెనుక స్పీకర్లు లేకపోయినా, సౌండ్ మాత్రం మన వెనుక నుంచే వస్తున్నట్టుగా ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. ఫీచర్లు కూడా లేటెస్ట్‌గా ఉంటాయి.

Amazon Fire TV Soundbar Plus

మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా, బడ్జెట్‌లో మంచి సౌండ్‌బార్ కావాలంటే అమెజాన్ ఫైర్ టీవీ సౌండ్‌బార్ ట్రై చేయొచ్చు. దీనికి విడిగా సబ్‌వూఫర్ కూడా వస్తుంది. మాటలు క్లియర్‌గా వినిపిస్తాయి, బేస్ కూడా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ఆప్షన్.

Also Read: ఒప్పో నుంచి 6,500mAh బ్యాటరీ ఫోన్ లాంచ్.. రూ.14,999కే 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఫీచర్లు!

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×