E-Paper
Advertisement

Nikhil: ‘స్వయంభు’ కథ ఎవరిదో చెప్పిన నిఖిల్.. 1000 ఏళ్ల క్రితం అల్లరిచిల్లరిగా తిరిగే అతని కథంట!

Nikhil: ‘స్వయంభు’ కథ ఎవరిదో చెప్పిన నిఖిల్.. 1000 ఏళ్ల క్రితం అల్లరిచిల్లరిగా తిరిగే అతని కథంట!
Advertisement

Nikhil: ‘కార్తికేయ 2’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నుంచి ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఇప్పుడాయన నుంచి రాబోతున్న ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా ‘స్వయంభు’ (Swayambhu). భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తోన్న ఈ భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్‌ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్‌లో కనిపించబోతున్నారు. నిఖిల్ సరసన నభా నటేష్, సంయుక్త హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్‌ని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్.. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఇది నిజంగా జరిగిన ఒక అండర్ డాగ్ కథ అని చెప్పడంతో, నిఖిల్ చెప్పిన వ్యక్తి ఎవరా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు.

Also Read- Mrithyunjay Teaser: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్.. హీరో అవడానికి ట్రై చేయకు!

నిఖిల్‌ మావాడు అని అంటారు

Advertisement

‘‘నేను రెండేళ్లు‌గా ఎవరికీ కనిపించలేదు. ఆ సమయంలో కూడా మీడియా నాకు ఎంతో సపోర్ట్‌ చేసింది. ‘హ్యాపీ డేస్‌’ మూవీ వచ్చి 19 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ అందరూ నాకు సపోర్ట్‌ చేస్తూనే వచ్చారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా విజయం తర్వాత దానికంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని.. ఇన్ని రోజులుగా కష్టపడుతున్నాను. చాలా శ్రద్ధతో భయంతో, ఒళ్లు దగ్గర పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ సినిమా చూసిన తర్వాత అంతా.. నిఖిల్‌ మావాడు అని హ్యాపీగా చెప్పుకుంటారు. మంచి కథని బెస్ట్ టెక్నీషియన్స్‌తో చేస్తున్నాం.

Also Read- Hushar Pittalu Teaser: గణేషుడితో స్టార్ట్ చేసి.. ఎక్కడికి తీసుకుపోయార్రా! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?

అల్లరిచిల్లరిగా తిరిగే నిజమైన ఓ అండర్ డాగ్ కథ

Advertisement

ఇప్పుడు వదిలిన టీజర్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ కథలో చాలా మలుపులు ఉన్నాయి. ఇకపై రాబోయే కంటెంట్‌లో మరింతగా రివీల్ చేస్తాము. త్రీడీలో చూసి నేనే షాక్ అయ్యా. ఈ సినిమా 3Dలో రాబోతుంది. ఈ రోజు మనమంతా ఇంత స్వేచ్ఛగా ఉండడానికి, వెనుక ఎంతోమంది త్యాగాలు చేశారు. అందరూ రాజుల గురించి మాట్లాడతారు కానీ, ప్రాణ త్యాగాలు చేసిన వారియర్స్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఎవరికీ తెలియదు కూడా. దాదాపు 1000 ఏళ్ల క్రితం చిత్తూరు రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే వారియర్ ఉండేవారు. అతడి కథే ఈ ‘స్వయంభు’. అతనొక అల్లరిచిల్లరిగా తిరిగే ఓ అండర్ డాగ్. అలాంటి అతను రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చెబుతున్నాం. ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన స్టోరీ. డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథను రెడీ చేశారు. ఇందులో నేనొక అండర్ డాగ్‌గా కనిపిస్తాను. ఓ అండర్ డాగ్ ఏం సాధించాడనేది బెస్ట్ విజువల్స్, మ్యూజిక్‌తో చూస్తారు’’ అని నిఖిల్ చెప్పుకొచ్చారు.

Also Read- Chiranjeevi: ‘పునాదిరాళ్లు’ కోసం కెమెరా ముందు నిలిచిన రోజు.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×