E-Paper
Advertisement

Hushar Pittalu Teaser: గణేషుడితో స్టార్ట్ చేసి.. ఎక్కడికి తీసుకుపోయార్రా! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?

Hushar Pittalu Teaser: గణేషుడితో స్టార్ట్ చేసి.. ఎక్కడికి తీసుకుపోయార్రా! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?
Advertisement

Hushar Pittalu Teaser: మంచి సినిమాలు తీస్తే ఎవరూ చూడటం లేదని, అంతా ఇప్పుడు బూతు కంటెంట్‌పైనే పడుతున్నారు. ‘శంకరాభరణం’ వంటి సినిమా ఇప్పుడొస్తే నిజంగానే ఎవరూ ఆదరించరు. అదేమంటే జన్-జీ అంటున్నారు. ఈ జనరేషన్‌కు ఏం కావాలో అదే సినిమాలుగా ఇస్తున్నామని వాదించే కొందరు దర్శకనిర్మాతలు, పదే పదే అలాంటి కంటెంట్‌‌పైనే ఫోకస్ పెడుతున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి కంటెంట్‌నే ఆదరిస్తున్నారు. కానీ, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామనేది మాత్రం ఆలోచించడం లేదు. సరే ఇదంతా ఇప్పుడెందుకు? అసలు విషయం ఏంటి? అని అనుకుంటున్నారా? తాజాగా, ‘హుషార్ పిట్టలు’ (Hushar Pittalu) అనే ఓ మూవీ టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూసిన ఎవరైనా సరే.. సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నార్రా నాయన! అని అనుకోకుండా ఉండలేరు. మరి అంతగా ఈ టీజర్‌ (Hushar Pittalu Teaser)లో ఏముందని అనుకుంటున్నారా?

Also Read- Chiranjeevi: ‘పునాదిరాళ్లు’ కోసం కెమెరా ముందు నిలిచిన రోజు.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

గుయ్య గుయ్య ఏంటని మాత్రం అడగొద్దు

Advertisement

టీజర్ స్టార్టింగ్‌ గణేషుడితో మొదలెట్టారు. బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే ఎటేటో తీసుకెళ్లి.. ఒకప్పుడు బాగా వినిపించిన ‘బీఎఫ్’లలో కలిపేశారు. టెన్త్ క్లాస్ పూర్తయ్యి కాలేజ్‌కు రెడీ అయిన హీరో.. గణేష్ విగ్రహం ముందు నిలబడి.. ‘గణేష్ బ్రో.. స్కూల్‌లో టాప్ ర్యాంక్ వచ్చేటట్టు చేశావ్.. అట్నే కాలేజ్‌లో కూడా అదే కంటిన్యుటీని మెయింటైన్ చెయ్. ఈ ప్రాసెస్‌లో ఏ దుష్టశక్తి కళ్లు నా మీద పడకుండా చూడు’ అని మొక్కుతుండగానే, హీరోయిన్ కళ్లు హీరోపై పడతాయి. కట్ చేస్తే సెల్ ఫోన్ వరల్డ్‌లోకి అడుగు పెట్టిన హీరో. మూడు గొర్రెలు అమ్మి మరీ తండ్రి కొనిపెట్టిన ఫోన్.. కొడుక్కి ఏ రకంగా ఉపయోగపడుతుందో అనే డిస్కషన్. రాత్రంతా ఒకటే గుయ్యా గుయ్యా అని భార్యతో అంటే, ‘అది ఫోన్‌లో గుయ్య గుయ్య కాదు.. చదువులో గుయ్య గుయ్య’ అని చెప్పే అమాయకపు భార్య. ఆ గుయ్య గుయ్య ఏంటని మాత్రం అడగొద్దు. అది తెలియాలంటే టీజర్ చూడాల్సిందే.

Also Read- Akkineni Hero: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్ తోనే ప్రేమలో పడిన అక్కినేని హీరో.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చేస్తున్నారు

Advertisement

నెక్స్ట్ ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసే బ్యాచ్‌తో ముచ్చట్లు. అమ్మాయిని లైన్‌లో పెట్టడానికి ఇచ్చే సలహాలు, హడావుడి మధ్య.. ఎలాగోలా హీరోహీరోయిన్లు ప్రేమలో కలిసిపోతారు. అంతే, నువ్వు ‘బిఎఫ్’ చూస్తావా? అంటూ హీరోని డైరెక్ట్‌గా హీరోయిన్ అడగడంతో షాక్. ఈ సౌండ్స్ ఆ సౌండ్స్‌ లెక్కనే ఉన్నాయ్ కదా అని ఫ్రెండ్‌తో హీరోయిన్ అంటే.. ‘ఏ సౌండ్సే’ అని ఆమె అడగడం, అందుకు ఆమె ‘అదేనే.. బిఎఫ్’ అని చెప్పడం చూస్తుంటే.. ఎవరిని టార్గెట్ చేసి ఈ సినిమాను చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఓ కొటేషన్.. ‘ఇప్పటి పిల్లలు కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టున్నారు’ అని జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ టీజర్‌లో లాస్ట్ షాట్ అయితే మరీ దారుణం. ఇప్పటి యువత, పిల్లలు సెల్‌ఫోన్స్ చూసి ఎంతగా చెడిపోతున్నారో చెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ, ఇలాంటి సినిమాలతో మరింతగా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని మాత్రం గ్రహించలేకపోతున్నారు. అంతా బూతు చూపించి, చివరిలో చిన్న మెసేజ్ ఇచ్చే నేపథ్యంలోనే ఈ ‘హుషార్ పిట్టలు’ ఉండబోతున్నారనేది ఈ టీజర్ తెలియజేస్తుంది. అందుకే అంది.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. ఈ సినిమా తీస్తున్నారని?

Also Read- Nikhil Siddarth: ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలని ఉంది.. నిఖిల్ కు ఆ ఛాన్స్ వచ్చేనా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×