Mrithyunjay Teaser: శ్రీవిష్ణు సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందనే విషయం తెలియంది కాదు. అందుకే ఆయనని కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని పిలుస్తుంటారు. అందుకు కారణం, ఆయన చేసే చిత్రాలు విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో ఉంటాయి. రొటీన్‌గా కాకుండా, ప్రతి చిత్రానికి వేరియేషన్ చూపిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అలాంటి శ్రీవిష్ణు (Sree Vishnu) నుంచి ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాబోతోంది. హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మృత్యుంజయ్’ (Mrithyunjay). రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన ‘సామజవరగమన’ ఫేమ్ రెబా మోనికా జాన్ మరోసారి జంటగా కనిపించబోతోంది. ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర టీజర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ (Mrithyunjay Teaser) ఎలా ఉందంటే..
‘‘ఒక మనిషి అతడి గురించి మూడు విషయాలు మార్చుకోలేడు. మొదటిది వాడి హైట్.. ఇప్పుడది ఇర్రెలెవెంట్. రెండోది వాడు చూసే విధానం. మూడోది ఎవడికివాడు హీరోగా ఫీలవడం’’ అనే శ్రీవిష్ణు చెబుతున్న డైలాగ్‌తో ఈ టీజర్‌ను హైలెట్ చేశారు. శ్రీవిష్ణు ఈ డైలాగ్ చెబుతుంటే, స్క్రీన్‌పై అద్భుతమైన సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. మెయిన్ ఈ కథ మూడో పాయింట్ మీదే నడిచినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. ఒక పర్సన్ చనిపోయి ఉంటే, అతను చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, మర్డర్ అంటూ శ్రీవిష్ణు డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే.. ‘హీరో అవడానికి ట్రై చేయకు జై’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో.. అతని పాత్ర ఇందులో ఏ విధంగా జర్నీ చేయబోతుందో అర్థమవుతోంది. ఇక విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. ఇందులో సరికొత్తగా విలన్‌ని ప్రజంట్ చేయబోతున్నారనే విషయం తెలుస్తోంది. యాక్సిడెంటా? మర్డరా? అనే ఇన్విస్టిగేషన్‌లో వచ్చే ఆసక్తికర విషయాలే ఈ సినిమా అనేలా టీజర్‌ని కట్ చేశారు. వాస్తవానికి ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీ, ఇందులో ఏదో కొత్త పాయింట్ చెప్పబోతున్నట్లుగా అయితే ఈ టీజర్ క్లారిటీ ఇస్తోంది. అదేంటనేది తెలియాలంటే.. ఫిబ్రవరి 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read- K.V.Anudeep: వెంకీ మామతో అనుదీప్ మూవీ.. డబుల్ డోస్ కామెడీ పక్కా?
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఈ మధ్య ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఓటీటీలలో కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి చిత్రాల్లో విషయాన్ని ఎంత క్రిస్ప్‌గా, ఎంత కొత్తగా చెప్పారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే, ఇందులో విషయం ఉన్నట్టే అనిపిస్తోంది. శ్రీవిష్ణు స్టైల్‌కు తగ్గట్టుగా రూపొందిన ఈ సినిమాలో ఐపీఎస్ సీతా పరుశురామ్‌గా రెబా మోనికా జాన్ కనిపించనుంది. ఇక వరుస అప్డేట్స్‌తో ఈ సినిమాను వార్తలలో ఉంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే శ్రీవిష్ణుకు ఈ సినిమా మరో సక్సెస్‌ఫుల్ సినిమాగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read- Chiranjeevi: ‘పునాదిరాళ్లు’ కోసం కెమెరా ముందు నిలిచిన రోజు.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్!