E-Paper
Advertisement

Tapsee: సెట్‌లో ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు.. సౌత్ దర్శకులు గురించి తాప్సీ పన్ను షాకింగ్ వ్యాఖ్యలు..!

Tapsee: సెట్‌లో ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు.. సౌత్ దర్శకులు గురించి తాప్సీ పన్ను షాకింగ్ వ్యాఖ్యలు..!
Advertisement

Tapsee: టాలీవుడ్ సినిమాల ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను. తాప్సీ పన్ను ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తనకు ఎదురైన అనుభవాలను దాచకుండా, నేరుగా చెప్పడం ఆమె స్వభావం. తాజాగా తన కొత్త సినిమా అస్సీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, దక్షిణాది సినిమా పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే అసౌకర్యాల గురించి ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల లుక్స్, శరీరాకృతి విషయంలో దర్శకులు చాలా ఎక్కువగా పట్టుబడతారని చెప్పింది. షూటింగ్ సమయంలో, ముఖ్యంగా పాటల సన్నివేశాలు తీస్తున్నప్పుడు, తనను “ప్యాడెడ్ బ్రా” వేసుకోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించింది. ఆ విషయాన్ని సెట్‌లో ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న సందిగ్ధతలో చివరకు ఆ మాట తన వరకు వచ్చేదని ఆమె తెలిపింది.

వాళ్ళు ఎవరికి చెబుతారో తెలుసా..!

Advertisement

ఆ అనుభవం గురించి తాప్సీ మాట్లాడుతూ..“సౌత్‌లో చాలాసార్లు ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెబుతారు. కానీ ఆ విషయం దర్శకుడు సెట్‌లో ఎవరికీ చెప్పాలి అన్నదే పెద్ద సమస్య. సెట్‌లో పాట షూటింగ్ జరుగుతుంటే, అందరూ ఆ తేడా వైపే చూస్తుంటే, అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించండి.”

అందరి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడటం వల్ల తనకు చాలా అసౌకర్యంగా అనిపించేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక నటిగా కెమెరా ముందు నటించాల్సిన సమయంలో, సెట్‌లో ఉన్నవాళ్లందరి చూపులు మన శరీరంపై పడటం మానసికంగా చాలా ఒత్తిడిని కలిగిస్తుందని తాప్సీ చెప్పింది.

Advertisement

ఇది ఇలా మాట్లాడటం మొదటిసారి కాదు గతంలో కూడా ఆమె, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోణంలో చూపించే కొన్ని సన్నివేశాలపై బహిరంగంగా విమర్శలు చేసింది. ఆ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ దక్షిణాది సినిమా పరిశ్రమలోని అంతర్గత విషయాలను బయటపెట్టడంతో ఆమె మాటలు మరోసారి చర్చకు దారి తీశాయి.

ALSO READ: Rakul Preeth Singh : అబ్బా.. చీరలో రకుల్ ఎంత అందంగా ఉందో..రెండు కళ్లు చాలట్లేదు మావా..

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×