E-Paper
Advertisement

ChatGPT Speaker: చాట్‌జీపీటీ కెమెరా స్పీకర్ త్వరలోనే లాంచ్.. సులువుగా షాపింగ్, పేమెంట్స్.. ధర ఎంతంటే

ChatGPT Speaker: చాట్‌జీపీటీ కెమెరా స్పీకర్ త్వరలోనే లాంచ్.. సులువుగా షాపింగ్, పేమెంట్స్.. ధర ఎంతంటే
Advertisement

ChatGPT Speaker| ప్రపంచంలోనే అత్యంత పాపులర్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ. ఈ చాట్‌బాట్ రూపొందించిన ఓపెన్‌ఎఐ ఇప్పడు తన మొదటి హార్డ్‌వేర్ డివైస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది స్మార్ట్ స్పీకర్ కావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ స్పీకర్‌లో బిల్ట్-ఇన్ కెమెరాలు ఉండవచ్చు. అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో సరౌండింగ్స్‌ను అర్థం చేసుకుని పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా హార్డ్‌వేర్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది.

హార్డ్‌వేర్ డిజైన్ చేస్తున్న జోనీ ఐవ్ టీమ్

గత సంవత్సరం ఓపెన్‌ఎఐ కంపెనీ.. ఆపిల్ మాజీ డిజైనర్ జోనీ ఐవ్‌ను హైర్ చేసింది. ఐకానిక్ ఆపిల్ ప్రొడక్ట్స్ ఐవ్ టీమ్ డిజైన్ చేసింది. ఇప్పుడు ఓపెన్‌ఎఐ హార్డ్‌వేర్ డిజైన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. ఐవ్ స్టార్టప్ ioను ఓపెన్‌ఎఐ $6.5 బిలియన్‌కు కొనుగోలు చేసింది. సుమారు 200 మంది హార్డ్‌వేర్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు.

స్మార్ట్ స్పీకర్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

రిపోర్టుల ప్రకారం.. ఈ స్పీకర్‌లో కెమెరా ఉంటుంది. చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించగలదు. ఫేషియల్ రికగ్నిషన్‌తో వ్యక్తులను గుర్తిస్తుంది. ఫేస్ ఆథెంటికేషన్‌తో డివైస్ అన్‌లాక్ అవుతుంది. ఆపిల్ ఫేస్ ID లాగా పనిచేస్తుంది. వాయిస్ కమాండ్స్‌తో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం బట్టి స్మార్ట్‌గా స్పందిస్తుంది.

షాపింగ్, పేమెంట్ ఫీచర్లు

వాయిస్ కమాండ్స్‌తో ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్‌తో సురక్షిత పేమెంట్స్ చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ సులభమవుతుంది. కానీ బయోమెట్రిక్ డేటా సేఫ్టీపై ఆందోళనలు ఉన్నాయి. యూజర్ డేటాను ఎలా సెక్యూర్ చేస్తారో ఇంకా స్పష్టం చేయలేదు.

ప్రైవసీ ఆందోళనలు, ఆల్వేస్-ఆన్ లిజనింగ్

Advertisement

సాధారణ స్మార్ట్ స్పీకర్లు వేక్ వర్డ్ తర్వాతే వింటాయి. కానీ ఈ డివైస్ నిరంతరం వింటూ, చూస్తూ ఉండే అవకాశం ఉంది. చుట్టూ జరిగే సంభాషణలను ట్రాక్ చేయవచ్చు. యూజర్ బిహేవియర్ ఆధారంగా స్మార్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. కానీ ఇది ప్రైవసీకి పెద్ద రిస్క్. నిరంతర సర్వైలెన్స్ ఆందోళన కలిగిస్తోంది. ఓపెన్‌ఎఐ ఇంకా స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు.

లాంచ్ టైమ్‌లైన్, ధర

2027 ప్రారంభం నాటికి ఈ స్మార్ట్ స్పీకర్ లాంచ్ అవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అధికారిక లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అమెరికాలో ధర $200 నుంచి $300 మధ్య ఉండవచ్చు. అంటే భారతదేశంలో సుమారు రూ.18,000 నుంచి రూ.27,000 మధ్య ఉండవచ్చు.

Also Read: ప్రపంచంలో అతి చిన్న QR కోడ్ రెడీ.. వేల సంవత్సరాల డేటా స్టోరేజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్

భవిష్యత్ హార్డ్‌వేర్ ప్లాన్స్

ఓపెన్‌ఎఐ స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ ల్యాంప్స్ కూడా తీసుకొస్తుంది. ఇన్-ఇయర్ ఆడియో డివైస్ కూడా ప్లాన్‌లో ఉంది. దీని కోడ్‌నేమ్ “Sweetpea”. ఇంకా ఫైనల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ కాలేదు.

AI హార్డ్‌వేర్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ

ఆపిల్ కూడా AI బేస్డ్ స్మార్ట్ గాడ్జెట్స్ తీసుకొస్తోంది. ఓపెన్‌ఎఐ ఎంట్రీతో AI హార్డ్‌వేర్ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో స్మార్ట్ డివైస్‌లలో పెద్ద ఇన్నోవేషన్ వస్తుంది.

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×