Tamannaah – Vijay Varma : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). గత 17 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో స్పెషల్ సాంగ్ లు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. మరొకవైపు ప్రముఖ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో గత రెండు సంవత్సరాలుగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
అంతే కాదు వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ తమ ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ప్రకటించగా.. సడన్గా బ్రేకప్ అయిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరు కూడా వ్యవహరిస్తున్నారు. పైగా బ్రేకప్ వార్తల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించలేదు. అలా మొత్తానికి అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ అభిమానులను కూడా పూర్తిస్థాయిలో నిరాశపరిచిందని చెప్పవచ్చు.
అమీర్ ఖాన్ లవర్ తో.. తమన్నా మాజీ లవర్..
ఇదిలా ఉండగా.. ఇప్పుడు తమన్నాతో బ్రేకప్ అయ్యిందో లేదో అప్పుడే తమన్నా మాజీ లవర్ విజయ్ వర్మ.. అమీర్ ఖాన్ (Aamir Khan) లవర్ ని బుట్టలో వేసుకున్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh).. గత కొన్ని రోజులుగా కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ..అందరినీ ఆశ్చర్యపరిచిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడు.. విజయ్ వర్మ లంచ్ కి వెళ్ళిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోలో విజయ్ ని ఆమె టైట్ గా హగ్ చేసుకోవడం, అతడికి ముద్దు పెట్టడం వంటివి కూడా చేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నా కూడా విజయ్ వర్మతో మరింత క్లోజ్ గా ఫోజులిచ్చింది. దీంతో ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ALSO READ: Tollywood: మలయాళ మూవీకి నోటీసులు.. మా సినిమా కాపీ కొట్టారంటున్న రాజమౌళి నిర్మాత
ఆమెతో అమీర్ ఖాన్ రిలేషన్.. అందుకే కిరణ్ రావుకి విడాకులు..
ఇకపోతే ఫాతిమా సనా షేక్ వల్ల గతంలో మరో హీరో కూడా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ సినిమాలో.. ఈమె ఆయనకు కూతురు పాత్రలో నటించింది. అయితే అదే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య నడిచిందని, ఆ కారణంగానే అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు (Kiran Rao) కి విడాకులు ఇచ్చారు అని చాలామంది కామెంట్లు చేశారు. పదహారేళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ కిరణ్ రావుకి విడాకులు ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అలా అమీర్ ఖాన్ ప్రేయసిగా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు అమీర్ ఖాన్ కి కూడా బ్రేకప్ చెప్పి విజయ్ వర్మ కి దగ్గర అయింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమన్నా ఎక్స్ లవర్ తో అమీర్ ఖాన్ లవర్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సంచలనంగా మారింది.