Man Beaten Death: రైళ్లలో సీట్ల కోసం ప్రయాణీకులు తరచుగా గొడవలు పడటం చూస్తూనే ఉంటాం. ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రోలో ఇలాంటి కొట్లాటలు కామన్ గా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ రైల్లో సీటు కోసం జరిగిన పంచాయితీ ఏకంగా ఓ ప్రయాణీకుడి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఖేక్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
శుక్రవారం నాడు ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా ఖేక్రా రైల్వే స్టేషన్ సమీపంలో సీటు విషయంలో జరిగిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. 20 మంది వ్యక్తుల బృందం కదులుతున్న రైళ్లో ఓ వ్యక్తిని కొట్టి చంపినట్లు ఆరోపణులు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని దీపక్ యాదవ్ గా గుర్తించారు. ఈ ఘటన ఢిల్లీ- సహరాన్ పూర్ ప్యాసింజర్ రైలులో జరిగింది. దీపక్ యాదవ్ వారానికి ఓసారి ఈ రైలులో ప్రయాణం చేసేవాడు. తాజాగా అతడు తన బావమరిదితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఫఖర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అతడు దాడికి గుడరయ్యాడు. సీటు కోసం కొంత మంది దీపక్ తో గొడవ పడటంతో పాటు అతడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దీపక్ కాసేపట్లోనే చనిపోయాడు.
దాడికి సంబంధించిన వీడియో విడుదల
శుక్రవారం ఈ ఘటన జరగగా, శనివారం దీపక్ పై దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదల అయ్యింది. ఐదుగురు వ్యక్తులు కలిసి అతడిపై దాడి చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఇంకా చెప్పాలంటే 20 మంది బృందంలోని చాలా మంది దీపక్ ను కొట్టినట్లు ఆ వీడియోలో కనిపించింది. అంతేకాదు, దీపక్ ను కొడుకున్న సమయంలో తోటి ప్రయాణీకులు జోక్యం చేసినప్పటికీ వాళ్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
UP man beaten to death in a moving train over seat dispute
In UP's Baghpat, a passanger identified as Deepak Yadav was beaten to death in a moving train allegedly over seat dispute. The train was bound Shamli from Delhi when the incident happened. pic.twitter.com/vxBGpbGwkW
— Piyush Rai (@Benarasiyaa) June 21, 2025
Read Also: ట్రైన్ మిస్ చేశారా? వెంటనే TDR ఫైల్ చెయ్యండి.. కొత్త రూల్స్ ఇవే!
దీపక్ హత్యకు సంబంధించి ఐదుగురు అరెస్ట్
అటు దీపక్ మృతికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులను బాగ్ పత్ లోని ఖేక్రా నివాసితులు సంజీవ్, రాహుల్, విశాల్, ప్రియాంషు, సిద్ధార్థ్ లుగా గుర్తించారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత అల్లర్లు (191(2)), హత్య (103)కు సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. వాళ్లందరినీ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి జైలుకు తరలించినట్లు బరౌత్ సెక్షన్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ ఉధమ్ సింగ్ తలన్ తెలిపారు. త్వరలో వారిని విచారణ చేసి పూర్తి వివరాలను రాబట్టనున్నట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అటు దీపక్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.