Tollywood:మలయాళం సినీ ఇండస్ట్రీలో గత నెల థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ ఫాంటసీ చిత్రం లవ్లీ (lovely)ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. జూన్ 23(ఈ రోజు) నుంచీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై కాపీ రైట్ ఆరోపణలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అది కూడా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తీసిన ‘ఈగ’ మూవీ నిర్మాతలు ఈ కాపీ రైట్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
లవ్లీ మేకర్స్ కి ఈగ మూవీ నిర్మాతలు నోటీసులు..
ఇకపోతే మలయాళ మూవీ లవ్లీ దర్శకనిర్మాతలకు రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమాను నిర్మించిన వారాహి చలనచిత్రం ఇప్పుడు నోటీసులు పంపించింది. ఈగ సినిమాను కాపీ చేశారని కాపీరైట్ నోటీసులు పంపింది.
స్పందించిన లవ్లీ టీమ్..
ఇకపోతే వారాహి చలనచిత్రం అందించిన నోటీసులకు లవ్లీ చిత్ర బృందం స్పందించింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దిలీష్ నాయర్(Dileesh Nair) మాట్లాడుతూ.. కాపీరైట్ ఆరోపణలను ఖండించారు. దీనిని నిరూపించడానికి తన వద్ద టెక్నికల్ ఆధారం కూడా ఉంది అని, లీగల్ గానే స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
థియేటర్లలో లవ్లీ మూవీ రెస్పాన్స్..
గత నెల 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మలయాళ ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ లభించలేదు. దీంతో 3d లో కూడా సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఆ వెర్షన్ చిత్రీకరణ చాలా బాగుందని ప్రశంసలు లభించాయి. కానీ స్క్రిప్ట్ చాలా బలహీనంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. అటు ఐఎండీబీలో కూడా కేవలం 6.4 రేటింగ్ మాత్రమే లభించింది. ఇటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసినా.. ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. అయితే ఇక్కడ కేవలం ఓటీటీలో మలయాళం వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం.
Also read : Keerthy Suresh: మా కంటే హీరోలు తోపులేం కాదు.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
లవ్లీ సినిమా స్టోరీ..
లవ్లీ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. దిలీష్ నాయర్ (Dileesh Nair) దర్శకత్వం వహించిన లవ్లీ మూవీలో మాథ్యూ థామస్, శివాంగి కృష్ణకుమార్, మనోజ్ కే జయన్ లీడ్రోల్ పోషించారు. అనుకోకుండా జైలుకు వెళ్లే ఒక యువకుడికి అక్కడ ఒక మాట్లాడే ఈగ పరిచయం అవుతుంది. ఆ సమయంలో వీళ్ళ మధ్య బంధం ఎలా ఏర్పడింది? అనే ఒక భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఈగను చూస్తే రాజమౌళి మూవీలోని ఈగ నే మనకు గుర్తొస్తుంది. దీంతో ఆ గ్రాఫిక్స్ ను కాపీ చేశారని ఆరోపణలను ఇప్పుడు మూవీ మేకర్స్ ఎదుర్కొంటున్నారు ఇక ప్రస్తుతం మలయాళం వెర్షన్ లో మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. త్వరలో తెలుగు వెర్షన్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి మూవీ మేకర్స్ ఇప్పుడు నోటీసులు పంపించడం.. అక్కడి నుంచి లీగల్ గా ప్రొసీడ్ అవుతామని స్పందన రావడం అన్ని హాట్ టాపిక్ గా మారాయి.