BigTV English

Rohit Sharma: ఎలా ఉన్నారు ? హర్భజన్ కు తెలుగు నేర్పిస్తున్న రోహిత్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే

Rohit Sharma: ఎలా ఉన్నారు ? హర్భజన్ కు తెలుగు నేర్పిస్తున్న రోహిత్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే

Rohit Sharma:  టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా ఎదిగి… రోహిత్ శర్మ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అదే సమయంలో టి20 వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్ ట్రోఫీని కూడా టీమిండియా కు అందించిన రెండో క్రికెటర్ గా రికార్డు లోకి ఎక్కాడు రోహిత్ శర్మ. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఎక్కువ సంఖ్యలో టైటిల్స్ టీం ఇండియాకు అందించిన కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ… మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు తెలుగు నేర్పిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?

హర్భజన్ సింగ్ కు తెలుగు నేర్పిస్తున్న రోహిత్ శర్మ


టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ దంపతులు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో క్రికెట్ సెలబ్రిటీలను… ఇంటర్వ్యూ చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు. ఇందులో భాగంగానే తాజాగా టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే ఆయన భార్య రితిక లను ఇంటర్వ్యూకు పిలిచారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ అటు హర్భజన్ సింగ్ మధ్య చాలా రకాల ఫన్నీ ఇన్సిడెంట్ జరిగాయి.

ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కు తెలుగు వర్డ్స్ కూడా నేర్పించాడు రోహిత్ శర్మ. అదేంటి రోహిత్ శర్మకు తెలుగు రాదు కదా… అతనెలా హర్భజన్ సింగ్ కు తెలుగు నేర్పించాడని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ..తల్లి పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే కావడం విశేషం. అయితే రోహిత్ శర్మ ఫ్యామిలీ మాత్రం ముంబైలో సెటిల్ అయింది. రోహిత్ శర్మ తండ్రి మహారాష్ట్రకు సంబంధించిన వాడు. అందుకే రోహిత్ శర్మ తన తల్లి దగ్గర తెలుగు వర్డ్స్ తరచూ నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు వైజాగ్ వెళ్లి గడుపుతూ ఉంటాడు.

ఇదే విషయాన్ని హర్భజన్ సింగ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అంతేకాదు తాను నేర్చుకున్న తెలుగు పదాలను హర్భజన్ సింగ్ కు కూడా నేర్పించాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలోనే… ఎలా ఉన్నారు? అంటూ హర్భజన్ సింగ్ కు తెలుగు నేర్పే ప్రయత్నం చేశాడు. ఇక రోహిత్ శర్మ చెప్పినట్లుగానే… హర్భజన్ సింగ్ కు నేర్చుకున్నాడు. ఎలా ఉన్నారు అంటే…. నేను బాగున్నాను అని చెప్పాలంటూ… హర్భజన్ కు రోహిత్ శర్మ నేర్పిన తెలుగు వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు.

పెళ్లి కంటే ముందే డేటింగ్ చేసిన రోహిత్ శర్మ

హర్భజన్ సింగ్ చేసిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పంచుకున్నాడు. పెళ్లి జరగక ముందు అంటే ఆరు సంవత్సరాల కంటే ముందే రితికను.. చూసినట్లు వెల్లడించాడు రోహిత్ శర్మ. ఓ యాడ్ షూట్ లో.. ఇద్దరు… కలిశారట. అప్పటినుంచి ఇద్దరు మధ్య ప్రేమ చిగురించిందని తెలిపాడు. అలా ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు రోహిత్ శర్మ.

Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !

 

 

 

Related News

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Big Stories

×