E-Paper
Advertisement

Voice Biomarkers: మీ వాయిస్‌ను బట్టి మీకేమేం రోగాలు ఉన్నాయో చెప్పేసే కొత్త టెక్నాలజీ! ఇది నిజమేనా?

Voice Biomarkers: మీ వాయిస్‌ను బట్టి మీకేమేం రోగాలు ఉన్నాయో చెప్పేసే కొత్త టెక్నాలజీ! ఇది నిజమేనా?
Advertisement

Voice Biomarkers: సాధారణంగా మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన మూడ్ బాగుందో లేదో మన గొంతును బట్టి వాళ్లు కనిపెట్టేస్తుంటారు. కానీ, ఇప్పుడు కేవలం మన మూడ్‌నే కాదు, భవిష్యత్తులో మనకు వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను కూడా మన గొంతు ద్వారా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనినే వైద్య పరిభాషలో ‘వాయిస్ బయోమార్కర్స్’ (Voice Biomarkers) సాంకేతికత అని పిలుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. రండి.. ఈ సరికొత్త టెక్నాలజీ పనితనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గొంతులో దాగున్న ఆరోగ్యం..

మనం మాట్లాడేటప్పుడు మన ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ అన్నీ కలిసి పనిచేస్తాయి. అందుకే మన శరీరంలో ఏదైనా చిన్న మార్పు జరిగినా, అది మన గొంతులోని శృతి, వేగం లేదా స్పష్టతపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా మన చెవులకు వినిపించని ఈ సూక్ష్మమైన మార్పులను కృత్రిమ మేధ(AI) సులువుగా పసిగట్టగలదు.

Advertisement

Also Read: పీరియడ్స్ టైంలో జ్వరం, నీరసమా? పీరియడ్ ఫ్లూ నుంచి ఉపశమనం పొందే చిట్కాలివే!

ఏయే వ్యాధులను పసిగట్టవచ్చు?

వాయిస్ అనాలిసిస్ ద్వారా ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలను, డయాబెటిస్ వంటి మెటబాలిక్ వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా, పార్కిన్సన్స్ లేదా అల్జీమర్స్ వంటి మెదడుకు సంబంధించిన సమస్యలు బయటపడక ముందే, మాటలో వచ్చే తడబాటు ద్వారా వీటిని గుర్తించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శ్వాసకోశ ఇబ్బందులను కూడా గొంతు మార్పుల ద్వారా అంచనా వేయవచ్చు.

ఎందుకీ పద్ధతి ప్రత్యేకం?

Advertisement

రక్త పరీక్షలు, స్కానింగ్‌లు అంటే చాలామందికి భయం. అంతేకాదు.. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని కూడా. కానీ ఈ వాయిస్ టెస్టింగ్ అనేది చాలా ఈజీ. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చుని మీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ముందస్తు హెచ్చరికగా పనిచేసి, సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించేలా మనల్ని అప్రమత్తం చేస్తుంది.

భవిష్యత్తు దిశగా అడుగులు..

ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఒత్తిడి లేదా వయస్సు రీత్యా కూడా గొంతు మారవచ్చు కాబట్టి.. AI ఇచ్చే ఫలితాలే ఫైనల్ అని పిక్స్ అవ్వొద్దు. ఏది ఏమైనప్పటికీ.. భవిష్యత్తులో మన వాయిసే ఓ డిజిటల్ థర్మామీటర్‌లా మారి, వ్యాధులను ముందే అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: మొదటిసారి చేసేవారు కూడా అదిరిపోయేలా చేసే గోంగూర పులిహోర రెసిపీ!

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×