Mohsin Naqvi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంటులో ( ACC Mens Asia Cup Rising Stars 2025) పాకిస్తాన్ A ఛాంపియన్ గా నిలిచింది. సూపర్ ఓవర్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ A, బంగ్లాదేశ్ Aపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ( ACC President Mohsin Naqvi) ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దోహలో ( West End Park International Cricket Stadium, Doha ) జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీతో పాటు అమెరికా తాత్కాలిక రాయబారి నటాలీ బేకర్ ( US Ambassador Natalie Baker) కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంటు ( ACC Mens Asia Cup Rising Stars 2025) ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో దోహ స్టేడియానికి వచ్చిన మొహ్సిన్ నఖ్వీ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాచ్ చూస్తున్న నేపద్యంలో అమెరికా తాత్కాలిక రాయబారి నటాలీ బేకరితో మొహ్సిన్ నఖ్వీ అసభ్యకరంగా ప్రవర్తించారట. చెత్త ప్రశ్నలతో ఆమెను విసిగించినట్లు తెలుస్తోంది. ఆమెతో ఎఫైర్ పెట్టుకునేందుకు కూడా ప్లాన్ చేశారట మొహ్సిన్ నఖ్వీ. దీంతో ఆమె కాస్త సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. అతిథిగా వచ్చిన మెరికా తాత్కాలిక రాయబారి నటాలీ బేకర్ ( US Ambassador Natalie Baker) పట్ల మొహ్సిన్ నఖ్వీ వ్యవహరించిన తీరుపై ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి మొహ్సిన్ నఖ్వీని తొలగించాలని అంటున్నారు.
మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియా చేతిలో చితైన పాకిస్తాన్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో మాత్రం ఛాంపియన్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ఫైనల్ దాక వెళ్లిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో చిత్తు చేసి చాంపియన్ గా నిలిచింది. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 6 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 4 బంతుల్లో టార్గెట్ ఫినీష్ చేసింది పాకిస్తాన్. దీంతో టైటిల్ గెల్చుకుంది. ఇక టైటిల్ గెల్చుకున్న పాకిస్తాన్ కు భారీ నజరానా అందింది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న పాకిస్తాన్ కు దాదాపు 2.6 కోట్లు దక్కాయి. ఫైనల్ లో ఓడిపోయిన బంగ్లాదేశ్ కు 1.7 కోట్లు దక్కనున్నాయి.
https://x.com/hashtag/MohsinNaqvi?src=hashtag_click
🚨🚨ACC President Mohsin Naqvi presence as chief guest at the #AsiaCupRisingStars final in Doha alongside Acting US Ambassador Natalie Baker.
#PakistanCricket #MohsinNaqvi pic.twitter.com/f2Y5sLL5QX— Kiran Khan (@HelloKiranKhan) November 23, 2025