E-Paper
Advertisement

Parasakthi Movie : పొలిటికల్ పార్టీని కించపరిచారు… సంక్రాంతి సినిమాపై బ్యాన్ డిమాండ్..

Parasakthi Movie : పొలిటికల్ పార్టీని కించపరిచారు… సంక్రాంతి సినిమాపై బ్యాన్ డిమాండ్..
Advertisement

Parasakthi Movie : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయ నటించిన తాజా చిత్రం పరాశక్తి.. ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఏదో ఒక వివాదం వల్ల ఆగిపోతూనే వస్తుంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటు వార్తలు వినిపిస్తున్నాయి.. జనవరి 10 న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో  వివాదాలతో ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనే టాక్ ను అందుకుంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి చిత్రయూనిట్ కు షాక్ తగిలింది.. ఓ ప్రముఖ పార్టీ నేతలు తమ పార్టీ అధినేతను కించపరిచారని ఆరోపించారు. అంతేకాదు మూవీని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలేం జరిగిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

Also Read : ‘టాక్సిక్ ‘ మూవీ డైరెక్టర్‌పై పోలీస్ కేసు.. ఏం జరిగిందంటే..?

శివకార్తికేయన్ ‘పరాశక్తి ‘ మూవీ బ్యాన్..

Advertisement

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్‌గా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పరాశక్తి.. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటించింది..జనవరి 10న పరాశక్తి ప్రేక్షకుల ముందుకొచ్చింది.. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమాను నిర్మించారు.. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది.. అలాగే ఇప్పుడు సినిమాను బ్యాన్ చెయ్యాలంటు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ స్టోరీ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత అయిన ఇందిరా గాంధీని తమిళీలు వ్యతిరేకంగా చూపించారని కాంగ్రెస్ నేతలు పలువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తున్న సినిమాలను వెంటనే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి…

‘పరాశక్తి’ మూవీ కలెక్షన్స్.. 

శివకార్తికేయన్ గతంలో నటించిన మదరాసి మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. అంతకు ముందు వచ్చిన అమరన్ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం పరాశక్తి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మూడు రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చేసింది. మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. పరాశక్తికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.. అయితే సినిమాలాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటివరకు ఉన్నంతలో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను వసూల్ చేసింది.. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే వివాదాలు మాత్రం తలెత్తుతున్నాయి. సినిమాను బ్యాన్ చెయ్యాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. మరి చిత్ర యూనిట్ స్టోరీ పై వస్తున్న విమర్శల పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×