E-Paper
Advertisement

Toxic Movie : ‘టాక్సిక్ ‘ మూవీ డైరెక్టర్‌పై ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..?

Toxic Movie : ‘టాక్సిక్ ‘ మూవీ డైరెక్టర్‌పై ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..?
Advertisement

Toxic Movie : కేజిఎఫ్ మూవీ తో ఒక్కసారిగా ఫేమస్ అయిన హీరో యష్.. రాక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మూవీ తర్వాత అతని పాపులారిటీ పూర్తిగా పెరిగింది. ఆ తర్వాత ఈ మూవీ కి సీక్వెల్ గా వచ్చినా కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో అతని క్రేజ్ మరింత పెరిగింది.. దాంతో పాన్ ఇండియా హీరోగా మారాడు.. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న మూవీ టాక్సిక్.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యష్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తూ చిత్ర డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ప్రస్తుతం ఇది కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు ఏం జరిగింది? ఎందుకు డైరెక్టర్ పై కేసు నమోదు అయింది? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

టాక్సిక్ డైరెక్టర్ పై పోలీస్ కేసు నమోదు.. 

హీరో యష్ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్‌ సీన్‌ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆ సీన్ తొలగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.. టీజర్ బాగానే ఉంది. అందులో యష్ లుక్ కూడా ఇంకా బాగుంది.. అయితే కొన్ని సీన్ కు సంబంధించిన సౌండ్లు మాత్రం జనాలకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా.. కారులో యశ్‌తో పాటు మరో యువతిల మధ్య ఒక ఇంటిమేట్‌ సీన్‌ ఉంటుంది.. అది జనాలకు పెద్దగా నచ్చలేదు.. దాంతో సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా చిత్ర నిర్మాత, దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. ఆ సీన్ గురించి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చిన కూడా వివాదాలు మాత్రం ఆగలేదు. పోలీస్ కేసు కూడా నమోదు అవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది.

Advertisement

Also Read:అమెరికాలో దుమ్ము దులిపేస్తున్న రాజా సాబ్.. వసూళ్లు ఎంతంటే..?

టీజర్ పై భగ్గుమంటున్న మహిళ సంఘాలు.. 

ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని కూడా అభ్యంతరకరమైన సన్నివేశాలతో రావడంతో పలువురు మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిన్న హీరోయిన్లతో పాటుగా పెద్ద హీరోయిన్లు సైతం కొన్ని సినిమాలలో బోల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం ఈ టీజర్‌పై భగ్గుమంది.. పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీజర్‌లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మహిళలు, పిల్లలతో పాటు సాంస్కృతిక విలువలు దెబ్బతినేలా ఉన్నాయి అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు అలా ఉన్నాయంటూ డైరెక్టర్ పై పలు ఏరియాలో పోలీస్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. విమర్శలరు రావడంతో టీజర్‌పై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ స్పందించారు. అయితే, ఆమె చాలా వ్యంగ్య ధోరణిలో కామెంట్‌ చేశారు.. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో దొరకెక్కుతున్న ఏ సినిమా మార్చ్ 19న థియేటర్లలోకి రాబోతుంది. యష్ చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత చేస్తున్న సినిమా కాదు ఈ మూవీ వైపు భారీ అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి.

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×