E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!
Advertisement

Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బుల్లి తెరపై అతి పెద్ద  రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక రెండు రోజులలో పదవ సీజన్ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రసారం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 10 సుధీర్ రెడ్డి..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలతోపాటు బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్, యాంకర్లు, ఆర్. జేలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న వారిలో యాంకర్ సుధీర్ రెడ్డి (Sudheer Reddy) పేరు కూడా మొదటి నుంచి వినపడుతూనే ఉంది సుధీర్ రెడ్డి ఈసారి హౌస్ లో కంటెస్టెంట్ గా సందడి చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా సుధీర్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక పోస్ట్ చూస్తుంటే మాత్రం ఈయన ఎంట్రీ కన్ఫర్మ్ అని స్పష్టమవుతుంది.

కాలం మారుతుంది.. మన కథ మారుతుంది..

Advertisement

ఈ నేపథ్యంలోనే సుధీర్ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ..” కాలం మారుతుంది మన కథ కూడా మారుతుంది.. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఈరోజు మనల్ని ఏడిపించిన కష్టం రేపు మన విజయానికి కారణం అవుతుంది” అంటూ ఈయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న నేపథ్యంలో ముందుగానే అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా సుధీర్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నానని ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పారు.

Advertisement

సుధీర్ రెడ్డి విషయానికి వస్తే..ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఆదాన్ మీడియా, సుధీర్ టాక్స్ ద్వారా యాంకర్‌గా మంచి గుర్తింపు పొందారు. సుధీర్ రెడ్డి. ఏపీలోని రాయలసీమకు చెందిన సుధీర్ రెడ్డి ఎంతోమంది వ్యాపారవేత్తలను సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మరి ఈయన నిజంగానే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? లేదా అనే విషయాలు తెలియాలి అంటే మరొక రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఆరవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే ఎప్పటిలాగే ఈ సీజన్లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

Also Read: బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×