Tanikella Bharani:తనికెళ్ల భరణి..ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.విలన్‌గా , తండ్రి గా ఇలా ఎన్నో పాత్రలు వేసి ఆడియన్స్ ని మెప్పించిన భరణి రైటర్ మరియు మంచి పోయెట్ అన్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భరణి పలు ఆసక్తికరమైన విషయాలు ఇలా పంచుకున్నారు.
ఇందులో యాక్టర్, రైటర్, పోయెట్… ఈ మూడింటిలో నీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే, ఒక్కటే ఎంచుకోవాల్సి వస్తే తాను కవిగానే ఉంటానని భరణి గారు చెప్పారు. ఆయనకి చిన్నప్పటి నుంచే ఇంట్లో బుక్స్ చదివే అలవాటు ఉండేదని, చందమామ కథల దగ్గర్నుంచి రామాయణం, మహాభారతం వరకు చదవడమే తన థింకింగ్ ప్రాసెస్‌ని మార్చిందని అన్నారు. చెట్టు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది. కానీ ఆ చెట్టు ఇచ్చే పువ్వు సువాసన, సున్నితత్వమే దానికి అసలైన అందం. మనుషుల్లో కూడా అలాంటి సెన్సిబిలిటీ ఉండాలని, కవిత్వమే ఆ ఫీలింగ్‌ని గుర్తుచేస్తుందని చెప్పారు.
సినిమా కథల గురించి మాట్లాడుతూ… విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో అంత పవర్ ఫుల్‌గా కనిపిస్తాడని అన్నారు. ఒక నార్మల్ పర్సన్ తనకు ఎదురైన ఒక పెద్ద ప్రాబ్లమ్‌ని ఎదురుకుని నిలబడినప్పుడే హీరో అవుతాడు. కాబట్టి ఊరికే హీరోని పొగిడే డైలాగ్స్ రాయడం కాకుండా, కథలో స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ఉండేలా చూడడమే అసలైన రైటింగ్ అని చెప్పారు.
ఇక ఆయన కెరీర్‌ని మార్చేసిన ‘శివ’ సినిమా సమయంలో జరిగిన ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకొచ్చాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి భరణి మొదట డైలాగ్స్ మాత్రమే రాసిన సంగతి తెల్సిందే. అయితే షూటింగ్ టైమ్‌లో ఒక రోల్‌కి యాక్టర్ దొరక్కపోతే వర్మ తననే నటించమన్నారని, దాంతో హైదరాబాద్ లోకల్ స్టైల్, తెలంగాణ యాస, లాల్చీ పైజామా, నల్ల తాడు, కళ్లకు సుర్మా, నోట్లో పాన్… ఇలా ఆ క్యారెక్టర్ లుక్‌ని తనే ప్లాన్ చేసుకుని నటించానని తెలిపాడు.ఇక ‘చిత్రం’ సినిమా నుంచి వరుసగా ఫాదర్ రోల్స్ వచ్చినా, ఒకే రకమైన రొటీన్ పాత్రలు చేయడం బోర్ కొట్టిందని, ప్రతి రోల్‌లో ఏదో ఒక వెరైటీ ఉండాలని చెప్పారు.
ఇక రాజమౌళి గురించి మాట్లాడుత డైరెక్టర్ అయిన కొత్తలో ఉన్న జోష్‌ను, ఆ తర్వాత ఆయనతో ‘బాహుబలి’లో స్వామీజీగా చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక త్రివిక్రమ్‌తో బాష గురించి మాట్లాడే విషయాలు తనకి ఎంతో సంతోషాన్నిస్తాయన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి సక్సెస్ కంటే కూడా, ఆయన తన ఫ్యామిలీని కలుపుకుని ఉండే విధానం తనకు చాలా ఇష్టమని చెప్పారు.
అయితే ఈమధ్య సినిమాల్లో ఎక్కువైపోతున్న వైలెన్స్ పై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు భరణి.అస్తమానం బ్లడ్ బాత్ చూపించేస్తే మరణానికి ఉండే ఎమోషనల్ వాల్యూ తగ్గిపోతుందని చెప్పారు. ఒక చావు వెనుక ఉండే బాధ, దాని వల్ల వచ్చే రిజల్ట్ ఆడియెన్స్‌కి టచ్ అవ్వాలి తప్ప, వైలెన్స్‌ని నార్మల్ విషయంగా చూపించకూడదన్నారు. ఇప్పుడు చాలా సినిమాల్లో జస్ట్ ఒక సెకన్ నవ్వించే మీమ్ డైలాగ్స్ మాత్రమే ఉంటున్నాయని, పాత సినిమాల్లా ఎప్పటికీ గుర్తుండిపోయేలా డైలాగ్స్ రాయడమే రియల్ టాలెంట్ అని అన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా కథ, ఎమోషన్స్‌పై ఫోకస్ పెట్టినప్పుడే సినిమా ఆడియన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందని స్పష్టం చేశారు భరణి !
ALSO READ :ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!