E-Paper
Advertisement

ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!

ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!
Advertisement

Telugu Folk Songs:ఫోక్ సాంగ్స్ కి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.ఏ ఈవెంట్ చూసినా , ఏ ఫెస్టివల్ చూసినా, ఈ పెళ్లి జరిగినా ఈ ఫోక్ సాంగ్స్ కి స్టెప్పులు వేయాల్సిందే.మరి ఇప్పటివరకు వచ్చిన ఫోక్ సాంగ్స్ లో నెట్టింటిని ఒక రేంజ్ లో షేక్ చేసిన జానపదాలు ఏంటో చూసేద్దామా !

రాను బొంబాయికి రాను

Advertisement

వీటిలో ఫస్ట్ వినిపించే పాట ఏదైనా ఉందంటే అది ”రాను బొంబాయికి రాను” అనే పాటనే చెప్పుకోవాలి.రాము రాథోడ్, ప్రభ కలిసి పాడిన ఈ పాట నెట్టింటిని ఎలా షేక్ చేస్తుందో చెప్పక్కర్లేదు.రాము రాథోడ్,లిఖిత కలిసి నటించిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించగా ,ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ అయినా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం విశేషం.ఇక ఈ పాట ఇప్పటి వరకు అంటే వచ్చిన ఏడాదిలోనే ఏకంగా 942 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకున్నదంటే ఫోక్ లవర్స్ తో పాటు ఆడియన్స్ ని ఎంతలా మెప్పించిందో అర్థం అవుతుంది.

”ఎర్ర ఎర్రని రుమాలు గట్టి’’

Advertisement

ఇక ఈపాట తర్వాత నెట్టింటిని షేక్ చేసిన పాట ఏదైనా ఉందంటే అది ”ఎర్ర ఎర్రని రుమాలు గట్టి’’ పాట అనే చెప్పాలి. నాగదుర్గ నటించిన ఈ పాటని మల్లమ్మ పాడగా ,పాటని రాజేందర్ కొండ రాశారు. ఇక తనదైన మ్యూజిక్ తో ఎన్నో పాటలని పాపులర్ చేసిన మదీన్ ఎస్కే సంగీతం అందించగా ఎప్పటిలాగే నేనే అంటూ శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.ఇక నితీష్ మరవేణి, రాజేందర్ కొండ నిర్మించిన ఈ పాట వచ్చిన ఏడాదిలోనే ఏకంగా 432 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం విశేషం.ఇక ఈ పాట ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి డాన్స్ చేయడానికి ఒక బెస్ట్ సాంగ్స్ గా నిలిచిందంటే ఎంతగా ఆకట్టుకుందో అర్థం అవుతుంది

.‘బాసింగ బలాలు’

ఇక వీటి తర్వాత ఈ మధ్య కాలంలో అంతటి క్రేజ్ కొట్టేసిన పాట ఏదైనా ఉందంటే అది ‘బాసింగ బలాలు’అనే చెప్పాలి.కల్యాణ్ కీస్ మ్యూజిక్ అందించిన ఈ పాటనిస్వామి నరేష్ దుబ్బా రాయడంతో పాటు శ్రీనిధితో కలిసి పాడటం విశేషం .ఇక ఈ పాటకి కూడా శేఖర్ వైరస్ దర్శకత్వంతో పాటు , కొరియోగ్రఫీ చేయగా ఇందులో . ఈశ్వర్ సాయి, వైష్ణవి సోనీ తమదైన స్టెప్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు.

ఇక సతీష్ రెడ్డి బండి నిర్మించిన ఈ పాట రిలీజ్ అయిన నాలుగు నెలల్లోనే ఏకంగా 224 మిలియన్ల వ్యూస్ సాధించడం చూస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఈ పాట ఎలా షేక్ చేసిందో అర్థం అవుతుంది.

‘పేరు గల్ల పెద్ది రెడ్డి”

ఇక ఇదే క్రమం లో ఈ మధ్య కాలంలో చాలా మంది నోట్లో నానిన పాట ”పేరు గల్ల పెద్ది రెడ్డి”.బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాటకి మదీన్ ఎస్కే మ్యూజిక్ అందించగా మమతా రమేష్ పాటను పాడింది .ఇక ఇందులో ఫోక్ క్వీన్ నాగ దుర్గ అద్భుతమైన స్టెప్పులతో అలరించగా వాటికి శ్రీకాంత్ (లీడింగ్ బాయ్స్) దర్శకత్వం, కొరియోగ్రఫీ చేయడం విశేషం.ఇక ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేసింది అని చెప్పడానికి వచ్చిన పది నెలల్లోనే ఏకంగా 208 మిలియన్ల వ్యూస్ ఒక బెస్ట్ ఉదాహరణ అని చెప్పకతప్పదు.

‘ఓ పిలగా వెంకటేషు ”

ఇక వీటితో పాటు ఫోక్ ఇండస్ట్రీని ,ఇటు ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకున్న పాటగా ‘ఓ పిలగా వెంకటేషు ”ని స్పెషల్ గా చెప్పుకోవాలి.
. ప్రభ పాడటం తో పాటు లిరిక్స రాయగా దీనికి ఈ మధ్య కాలంలో బాగా పపౌలర్ అవుతున్న వెంకట్ అజ్మీరా మ్యూజిక్ అందించడం విశేషం.ఇక ఇందులో . పూజా నాగేశ్వర్ లీడ్ రోల్ లో కనిపించగా వచ్చిన రెండేళ్లలోనే ఏకంగా  400 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం.ఇంకా చాలా పాటలున్నప్పటికీ వాటిలో ఇవి మచ్చుకు కొన్ని అని చెప్పుకోక తప్పదు.

also read:‘గాజుల గల గల’ సింగర్‌కు ఏమైంది? సోషల్ మీడియాలో ఎందుకీ ట్రోలింగ్?

Tags

Related News

ఇంత అహంకారమా?  నాగార్జున ఫైర్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలిని?

రేయ్ త్రిగుణ్ లేగురా…మరీ ఇంత లేకిగానా.. ఇచ్చి పడేసిన నాగార్జున!

ఇదెక్కడి పోలిక రా నాయనా.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ మహాభారతంలో ఏ పాత్రకు సరిపోతారంటే?

ట్రెయిటర్స్‌లో ఆట పక్కన పెట్టి పర్సనల్ అటాక్‌లు.. ఇదేం గొడవరా బాబూ!

సుమ 116 ఏళ్ళు బ్రతకాలి..రాజీవ్ మాటలకు సుమ ఎమోషనల్!

బిగ్ బాస్ 10 హోస్ట్ గా రమ్య కృష్ణ…ఆ హీరో తప్పుకున్నట్టేనా?

‘గాజుల గల గల’ సింగర్‌కు ఏమైంది? సోషల్ మీడియాలో ఎందుకీ ట్రోలింగ్?

Big Stories

Advertisement
×