E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tasty Teja: అనిల్ రావిపూడి కాలేజ్‌లో నాకు సీనియర్.. అవకాశం ఇస్తుంటే నేనే జంప్!

Tasty Teja: అనిల్ రావిపూడి కాలేజ్‌లో నాకు సీనియర్.. అవకాశం ఇస్తుంటే నేనే జంప్!
Advertisement

Tasty Teja: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) గురించి కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘సుమతీ శతకం’ (Sumathi Sathakam) అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో టేస్టీ తేజ (Tasty Teja) యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో అమర్ దీప్ చౌదరి హీరోగా, శైలి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ సినిమాను విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించారు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ కూడా ఆశీస్సులు అందించారు. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో టేస్టీ తేజ ఓ మీడియా హౌస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించే కాకుండా, కాలేజ్ టైమ్‌లో తన సీనియర్ అయిన అనిల్ రావిపూడి గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.

Also Read- Varanasi: మహేష్ బాబు కోసం ఎప్పుడు చేయని పనికి మొదటిసారి ఒప్పుకున్న రాజమౌళి..!

నాతో నీకు కుదరదురా..

Advertisement

ఈ సందర్భంగా టేస్టీ తేజ మాట్లాడుతూ.. ‘‘కాలేజ్‌లో నాకంటే అనిల్ రావిపూడి సీనియర్. అప్పటి నుంచి అన్నతో మంచి ర్యాపో ఉంది. లాస్ట్ టైమ్ ఓ సినిమాలో అవకాశం ఇస్తానని అన్నారు, కానీ ఆ సమయంలో నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లాను. ఆయన అదే అన్నారు. నేను ఇద్దామనుకున్నప్పుడల్లా నువ్వు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళతావు.. బయటికి వచ్చాకేమో నాకివ్వలేదంటావు. నాతో నీకు కుదరదురా అంటారు. సరేలే అన్న నువ్వు ఎప్పుడంటే అప్పుడే చూడులే అని చెబుతుంటాను. ఆయనకు కనపడిన ప్రతిసారి చాలా ఆప్యాయంగా ఏరా తేజా ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. ప్రజెంట్ వర్క్ ఏంటి..? అని పలకరిస్తుంటారు. యూట్యూబ్ షార్ట్స్ చూసి.. నాకు మీమ్స్ కూడా పంపిస్తుంటాడు.

Also Read- Anna Lezhneva: వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అన్నా లెజినోవా పూజలు.. ఎందుకంటే?

ఈ సక్సెస్ రేట్ ఆగకూడదు అన్నా

Advertisement

ఆయనలో నాకు నచ్చిందేంటంటే ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో చాలా హై స్ధానంలో ఉన్నాడు. అయినా సరే.. నాకు పరిచయమైనప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయనలో కొంచెం కూడా మార్పు రాలేదు. అప్పుడు ఎలా ట్రీట్ చేసేవాడో.. ఇప్పుడు కూడా అలానే ట్రీట్ చేస్తున్నాడు. ఈ విషయంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నీ సక్సెస్‌లే.. ఈ సక్సెస్ రేట్ ఆగకూడదు అన్నా. అలా గ్రాఫ్ పెరుగుతూనే ఉండాలి. ప్రతి సంక్రాంతికి నువ్వు సినిమాతో రావాలి. మళ్లీ మళ్లీ మా ఫ్యామిలీతో నీ సినిమా చూస్తూ ఉండాలి. ఊరికే ఎప్పుడో ఒకసారి సినిమాలో అలా కనబడాలి అంతే..’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నారు. త్వరలోనే మరోసారి వెంకీమామతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

Also Read- Mohan Babu: విద్యార్థి నాయకులపై మోహన్ బాబు అనుచరులు దాడి, కిడ్నాప్‌.. తిరుపతిలో ఏం జరుగుతోంది?

Related News

రూ.5500 కాస్ట్లీ ఫ్రేమ్.. స్టార్ డైరెక్టర్లతో నవీన్ పోలిశెట్టి కామెడీ..!

గోవాలో ఖుష్బూ కూతురి పెళ్లి.. ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్‌కి దొరికిన మరో విజయ్ దేవరకొండ.. ఆకాశానికి ఎత్తేసిన ఆర్జీవి

పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!

నెట్టింట వైరల్ అవుతున్న లక్ష్మీ మంచు కామెంట్స్.. కలెక్షన్ కింగ్ వారసత్వం అంటే ఇదే మరి!

తారక్ రికార్డ్‌పై ‘పెద్ది’ గురి తప్పిందా?.. ఎంత కష్టపడినా చరణ్‌కు అది అందని ద్రాక్షేనా ?

Pawan Kalyan OG 2…ఊహించని రేంజ్‌లో ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!

Big Stories

×