E-Paper
Advertisement

Mohan Babu: విద్యార్థి నాయకులపై మోహన్ బాబు అనుచరులు దాడి, కిడ్నాప్‌.. తిరుపతిలో ఏం జరుగుతోంది?

Mohan Babu: విద్యార్థి నాయకులపై మోహన్ బాబు అనుచరులు దాడి, కిడ్నాప్‌.. తిరుపతిలో ఏం జరుగుతోంది?
Advertisement

Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీ (Mohan Babu University) మరోసారి వార్తలలో హైలెట్ అవుతోంది. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు అనేలా ర్యాంక్‌లు తెచ్చుకున్నందుకు కాదండోయ్.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అవును, ఆ మధ్య యూనివర్సిటీలో ఫీజుల వసూలు విషయమై స్వయంగా మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి, వారి గోడు వెల్లబోసుకుంటున్నారని, ఇది అన్యాయం అంటూ మంచు మనోజ్ మీడియా ముందు వాపోయారు. దీనిపై పోరాటం చేస్తానని కూడా వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడిదే విషయమో, లేదంటే వేరే ఇంకా ఏదైనా ఇష్యూనో తెలియదు కానీ, స్టూడెంట్ నాయకులపై మోహన్ బాబు అనుచరులు దాడి చేసి, వారిని కిడ్నాప్ చేసినట్లుగా తిరుపతిలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

Also Read – Amardeep Chowdary: అమర్ దీప్  సినిమాకు రవితేజ సపోర్ట్.. గాల్లో తేలిపోతున్న అమర్!

విద్యార్థి నాయకులపై దాడి, కిడ్నాప్

Advertisement

మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వెళుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోద్‌ అండ్ టీమ్‌పై దాడి చేయడమే కాకుండా, వారిని కిడ్నాప్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మోహన్‌ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాలలో వచ్చి అమానుషంగా విద్యార్థి నాయకులపై దాడి చేయడమే కాకుండా.. తమ వెంట తెచ్చుకున్న వాహనాలలో ఎక్కించుకుని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారట. విద్యార్థులపై దాడి, కిడ్నాప్ ఘటనతో మోహన్ బాబు యూనివర్సిటీ మరోసారి వార్తలలో హైలెట్ అవుతోంది. ఈ ఘటనపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి సీరియస్‌గా రియాక్ట్ అవడమే కాకుండా, విషయాన్ని ఏఎస్పీ రవి మనోహర్‌, ఎస్పీ సుబ్బరాయుడుల దృష్టికి తీసుకెళ్లి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read – Dhurandhar 2: డ్రోన్ ఎఫెక్ట్.. చిక్కుల్లో ‘ధురందర్ 2’ చిత్ర బృందం.. అసలు విషయమిదే!

తప్పులను వేలెత్తి చూపిస్తే దాడులా?

Advertisement

ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ.. విద్యార్థి నాయకులపై ఇలాంటి చర్యలు హీనాతి హీనమైనవి. వీటిని చూస్తూ ఉపేక్షించం. కిడ్నాప్ చేసిన విద్యార్థి నాయకులకు ఏమైనా అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మోహన్ బాబును హెచ్చరిస్తున్నాం. యూనివర్సిటీలో జరుగుతున్న తప్పులను వేలెత్తి చూపిస్తే, ఆ తప్పులను సరిచేసుకోకుండా దాడులు చేస్తారా? వెంటనే పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని, విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై ఎస్పీ సుబ్బరాయుడు స్పందిస్తూ.. విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడి, కిడ్నాప్‌ చేసిన గూండాలను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వారు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విద్యార్థి నాయకులు కిడ్నాప్‌‌కు వినియోగించిన వాహనాలను సైతం సీజ్‌ చేస్తామని, వారిని వెతికించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

మోహన్ బాబు, విష్ణుపై కేసు నమోదు

ఈ దాడి, కిడ్నాప్ ఘటనపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు యూనివర్సటీ పీఆర్వోపై కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీ‌లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులపై దాడి చేసి, కిడ్నాప్ చేసినందుకుగానూ తిరుచానూరు పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదైనట్లుగా సమాచారం.

Also Read- Dhurandhar 2: డ్రోన్ ఎఫెక్ట్.. చిక్కుల్లో ‘ధురందర్ 2’ చిత్ర బృందం.. అసలు విషయమిదే!

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×