E-Paper
Advertisement

Teja Interview: కన్నీళ్లు ఎవరూ చూడకూడదని.. ట్యాప్ విప్పి మరీ ఏడ్చిన దర్శకుడు తేజ!

Teja Interview: కన్నీళ్లు ఎవరూ చూడకూడదని.. ట్యాప్ విప్పి మరీ ఏడ్చిన దర్శకుడు తేజ!
Advertisement

Teja Interview: సినిమా ఇండస్ట్రీలో ‘తేజ’ అంటే ఒక మొండితనం, ఒక క్రమశిక్షణ, ఒక విలక్షణమైన శైలి గుర్తొస్తాయి. కానీ ఆ గంభీరమైన వ్యక్తిత్వం వెనుక ఎంతో లోతైన వేదన, అవమానాలు, కటిక పేదరికం దాగి ఉన్నాయని ఆయన తాజా ఇంటర్వ్యూ ద్వారా మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా తన చిన్ననాటి కష్టాలను తలచుకుంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన తేజ, చిన్నప్పుడు తను పడ్డ కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “చిన్నప్పుడు ఎవరైనా కొడితే, ఆ బాధను లేదా కన్నీళ్లను ఇతరులకు చూపించడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎవరూ చూడకూడదని బాత్‌రూమ్‌లోకి వెళ్లి, ట్యాప్ విప్పేసేవాడిని. నీళ్లు పడే ఆ భారీ శబ్దంలో నా ఏడుపు ఎవరికీ వినిపించేది కాదు. ఏడ్చి ఏడ్చి మొహం కడుక్కుని, ఏమీ ఎరగనట్టు మళ్ళీ బయటకి వచ్చేవాడిని” అని ఆయన పేర్కొన్నారు. ఆ వయసులోనే తన బలహీనతను ఎవరికీ చూపించకూడదనే ఆయన ఆత్మగౌరవం ఆశ్చర్య కలిగిస్తుంది.

Read also-Vijay Divorce: దళపతి విజయ్‌కు షాక్ ఇచ్చిన జేసన్ విజయ్.. ఏం చేశాడంటే?

నేల తుడిచే స్థాయి నుంచి..

Advertisement

తేజ నేడు వెండితెరపై సంచలనాలు సృష్టించినా, ఆయన ప్రయాణం మాత్రం ఎంతో కింది స్థాయి నుంచి మొదలైంది. కెరీర్ ప్రారంభంలో సుమారు 118 సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. షూటింగ్ సెట్స్‌లో నేలలు తుడవడం, స్మోక్ మెషిన్ పట్టుకోవడం, మేకప్ అసిస్టెంట్‌గా ఉండటం వంటి పనులన్నీ చేశారు. రోజుకు కేవలం 5 రూపాయల సంపాదనతో, ఆకలితో గడిపిన రోజులు ఆయనకు నేటికీ గుర్తుండటం విశేషం.

Read also-March Releases: ఈ నెలలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఇదే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

మర్చిపోలేని గాయాలు

Advertisement

తన జీవితంలోని ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. కుమారుడి మరణం, పడ్డ అవమానాలు, చిన్నప్పుడు తనను తిట్టిన వారు.. ఇవన్నీ ఇప్పటికీ తన మనసులో ఉన్నాయని, వాటిని రోజూ ఒక్కసారైనా తలచుకుంటానని చెప్పారు. ఆ అవమానాలే తనను ఈ స్థాయికి చేరేలా కసితో పని చేసేలా చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. “బలహీనంగా ఉన్నప్పుడు ప్రపంచం మనల్ని తొక్కేస్తుంది, అందుకే మన ఏడుపు కూడా లోకానికి వినిపించకూడదు” అనే కఠినమైన సత్యాన్ని తేజ తన జీవితం ద్వారా నేర్చుకున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×