E-Paper
Advertisement

TV Anchor: అయ్యయ్యో.. ఖమేనీ మృతి వార్త చదువుతూ ఏడ్చేసిన టీవీ యాంకర్.. వీడియో వైరల్

TV Anchor: అయ్యయ్యో.. ఖమేనీ మృతి వార్త చదువుతూ ఏడ్చేసిన టీవీ యాంకర్.. వీడియో వైరల్
Advertisement

TV Anchor: పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య, ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన ఉమ్మడి వైమానిక దాడుల్లో మరణించారని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఖమేనీతో పాటు మరికొంతమంది కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ వార్త బయటకు రావడంతో ఇరాన్ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

లైవ్ షోలో కన్నీరు పెట్టుకున్న యాంకర్
అయితే ఈ వార్తను చదువుతున్న ఒక యాంకర్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. “మన సుప్రీం నేత అమరులయ్యారు” అని చెబుతూ లైవ్ లోనే ఏడ్చేశారు. “ఇది దేశానికి తీరని లోటు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన వర్గాలకు పెద్ద దిక్కును కోల్పోవడం” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

40 రోజుల సంతాప దినాలు
ఖమేనీ మరణం నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఆయన మరణం తర్వాత ఇరాన్‌లో అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. మరోవైపు, తమ నేత మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ మరియు సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కరాచీలో అమెరికా ఎంబసీపై దాడి

Advertisement

ప్రాంతీయ ఉద్రిక్తతలు
ఈ పరిణామంతో అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ దేశాలు తమ సైనిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్ మద్దతు ఉన్న దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇది ఇరాన్ ప్రజలకు ఒక కొత్త అవకాశమని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలను మరింతగా కమ్మేలా చేస్తున్నాయి.

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×