E-Paper
Advertisement

Vijay Divorce: దళపతి విజయ్‌కు షాక్ ఇచ్చిన జేసన్ విజయ్.. ఏం చేశాడంటే?

Vijay Divorce: దళపతి విజయ్‌కు షాక్ ఇచ్చిన జేసన్ విజయ్.. ఏం చేశాడంటే?
Advertisement

Vijay Divorce: తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, జేసన్ సంజయ్ తన తండ్రి విజయ్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ (ఇన్‌స్టాగ్రామ్)లో అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల కుటుంబాల్లో అన్‌ఫాలో చేయడం అనేది వారి మధ్య సంబంధాలు సరిగా లేవనే సంకేతంగా భావిస్తారు. తల్లిదండ్రుల మధ్య విడాకుల చర్చలు జరుగుతున్న తరుణంలో, సంజయ్ తన తల్లి సంగీతకు మద్దతుగా నిలుస్తూ తండ్రికి దూరం జరిగినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read also-Akhil Debut: ఇప్పటికీ ‘అఖిల్’ సినిమా విషయంలో ఎమోషనల్ అవుతున్న వీవీ వినాయక్.. ఎందుకంటే?

విడాకుల వార్తలకు నేపథ్యం

Advertisement

విజయ్, సంగీత దంపతులు 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 25 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అది తెలిసి సంగీత మనస్తాపానికి గురయ్యారని సమాచారం. 2021 నుండే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని, విజయ్ ప్రవర్తన వల్ల సంగీత మానసిక వేదనకు గురయ్యారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా ఈ దంపతులు విడివిడిగానే ఉంటున్నారని, సంగీత లండన్‌లో లేదా చెన్నైలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారని సమాచారం. విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పనుల్లో బిజీగా ఉండగా, సంగీత ఏ ఒక్క పార్టీ కార్యక్రమానికి లేదా విజయ్ సినిమా ఈవెంట్లకు హాజరు కాలేదు.

Read also-March Releases: ఈ నెలలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఇదే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

కుమారుడి కెరీర్

Advertisement

జేసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సందీప్ కిషన్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. తన కొడుకు దర్శకుడిగా మారుతున్న తరుణంలో తండ్రి విజయ్ నుండి ఎలాంటి అధికారిక అభినందనలు లేదా మద్దతు సోషల్ మీడియాలో కనిపించకపోవడం కూడా వీరి మధ్య గ్యాప్ ఉందని సూచిస్తోంది. విజయ్ తన సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విడాకుల వార్తలపై విజయ్ కానీ, ఆయన ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏది ఏమైనా, కొడుకు సంజయ్ అన్‌ఫాలో చేయడం మాత్రం విజయ్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×