E-Paper
Advertisement

VinFast Electric Cars: విన్ ఫాస్ట్ నుంచి 3 కొత్త కార్లు, ఇంతకీ వాటి ప్రత్యేకత ఏటంటే?

VinFast Electric Cars: విన్ ఫాస్ట్ నుంచి 3 కొత్త కార్లు, ఇంతకీ వాటి ప్రత్యేకత ఏటంటే?
Advertisement

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ భారత్ లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026లో మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతోంది. గత సంవత్సరం తమిళనాడు ప్లాంట్‌ లో అసెంబుల్ చేసిన VF6, VF7 SUVలతో ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు సరసమైన మైక్రో-EV, కాంపాక్ట్ ఫ్యామిలీ MPVలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

⦿ లిమో గ్రీన్

విన్ ఫాస్ట్ సిటీ ఫ్యామిలీలు, ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని మూడు వరుసల ఎలక్ట్రిక్ MPV  లిమో గ్రీన్ ను విడుదల చేయబోతోంది. 2026 ఫస్ట్ క్వార్టర్ లో ఈ వెహికిల్ అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు రూ. 18-20 లక్షలుగా కంపెనీ ఫిక్స్ చేసింది. ఈ మోడల్ లో 60.1kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 201 bhp ఫ్రంట్ మౌంటెడ్ మోటారును కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 450 కి.మీ.ల రేంజ్ ను కలిగి ఉంటుంది. ఈ డిజైన్ విన్ ఫాస్ట్ సిగ్నేచర్ V ఆకారపు లైట్ ఎలిమెంట్స్, మెరుగైన హెడ్‌ రూమ్ కోసం వెనుక వైపు కొద్దిగా ఎత్తైన పైకప్పుతో కూడిన క్లీన్, స్లాబ్ సైడెడ్ సిల్హౌట్‌ను కలిగి ఉంటుంది. ఇతర SUVల మాదిరిగానే, MPV సెంట్రల్ టచ్‌ స్క్రీన్‌ పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది ప్రైవేట్ కొనుగోలుదారులు, షేర్డ్ మొబిలిటీ ఫ్లీట్ల కోసం రూపొందించబడింది.

⦿ VF3

Advertisement

విన్ ఫాస్ట్ నుంచి రానున్న మరో మోడల్ VF3. ఇది మైక్రో EVగా అందుబాటులోకి రానుంది. ఇది కూడా 2026 ఫస్ట్ క్వార్టర్ లో అందుబాటులోకి రానుంది. ఈ కారు ధర రూ. 8–10 లక్షలు ఉంటుంది. ఇది సిటీ, టౌన్ ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. మార్కెట్ లో MG కామెట్‌ తో పోటీ పడనుంది. ఇది 191mm గ్రౌండ్ క్లియరెన్స్‌ ను కలిగి ఉంటుంది. కాంపాక్ట్ సైజు ఉన్నప్పటికీ, VF3 మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. 18.6kWh బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్‌ పై 200 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

⦿ VF5

లిమో గ్రీన్, VF3తో పాటు విన్ ఫాస్ట్ తీసుకొస్తున్న మరో ఎలక్ట్రిక్ కారు VF5.  వియత్నాం, ఇండోనేషియాలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న VF5, ప్రపంచ వ్యాప్తంగా రెండు బ్యాటరీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 95bhp మోటారుతో జత చేయబడిన 29.6kWh యూనిట్ ను కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్ పై 268 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అటు 136bhp మోటారుతో యాడ్ చేయబడిన పెద్ద 37.23kWh ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్ పై 326km రేంజ్ ను ఇస్తుంది.  సైజ్ పరంగా VF5 పొడవు 3,967  ఉంటుంది. ఇది పంచ్ EV కంటే పొడవుగా ఉంటుంది.  అంతర్జాతీయ మార్కెట్లలో క్యాబిన్ 8 అంగుళాల టచ్‌ స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెథరెట్ అప్హోల్స్టరీ, కీలెస్ ఎంట్రీ, ముందు, వెనుక USB పోర్ట్‌ లు, PM2.5 ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ తో డ్రైవర్ సెంట్రిక్ లే అవుట్‌ను కలిగి ఉంది.

Advertisement

Read Also:  టెస్లా మోడల్ Yపై అదిరిపోయే డిస్కౌంట్.. ఎన్ని లక్షలో తెలుసా?

Related News

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×