E-Paper
Advertisement

Telangana Politics: కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ! పని చేసేందుకు సిద్ధం.. బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు

Telangana Politics: కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ! పని చేసేందుకు సిద్ధం.. బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు
Advertisement

Telangana Politics: బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్ మొదలైందా? కవిత ఎత్తులను చూసి ఆ పార్టీ నేతలు షాకవుతున్నారా? కవితతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ వెనుక వ్యూహం ఏంటి? రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్‌కు పలుమార్లు పీకే ఎందుకొచ్చారు? ఇదే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్. త్వరలో కొత్తగా మరో పార్టీ రాబోతోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పని చేయనున్నారట రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అందుకు ఆయన ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.  రెండు నెలల వ్యవధిలో కవితను హైదరాబాద్‌కు వచ్చి రెండుసార్లు కలిశారట ప్రశాంత్ కిషోర్.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సమావేశమయ్యారు. ఇరువురు కలిసి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం తెలుస్తోంది. పీకే ఇచ్చిన సూచనలతో తొలి విడత కవిత ప్రజల్లోకి వెళ్లి, బీఆర్ఎస్‌లో కొందరి  నేతల బండారం బయట పెట్టారు.

Advertisement

కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ!

కవితతో పీకే భేటీ అయిన విషయం తెలియగానే బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. తమ పార్టీ ఓటర్లను అటు వైపు తిప్పుకుంటారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.  ఈ వ్యవహారంపై రేపో మాపో పార్టీ అగ్రనేతలతో చర్చించేందుకు కొందరు నేతలు సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.

పీకే గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణాది ప్రజల నాడి పట్టిన రాజకీయ వ్యూహకర్త. ఆయన స్కెచ్ వేస్తే కచ్చితంగా గెలుపు ఖాయం.  కొన్ని పార్టీల నేతలు బలంగా నమ్ముతారు కూడా. సరిగ్గా ఫలితాలు ఆ విధంగా వచ్చాయి. ఏపీలో వైసీపీ, ఆ తర్వాత టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున ఆయన పని చేసి సక్సెస్ సాధించారు.

ALSO READ:  మేడారంలో వనదేవతలకు సీఎం రేవంత్ దంపతులు పూజలు

2023 ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ అధినేత-అప్పటి సీఎం కేసీఆర్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పీకే సూచనలను ఆ పార్టీ పట్టించుకోలేదు. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమికి అదీ కూడా ఓ కారణంగా చెబుతున్నారు కొందరు నేతలు.

తాజాగా కవితతో పీకే భేటీ కావడంతో రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. పీకే సలహాలు పాటిస్తే గెలుపు ఏమోగానీ..  ఓట్లు చీలిపోవడం ఖాయం. మొన్నటి బీహార్ ఎన్నికల్లో అదే జరిగిందని అంటున్నారు రాజకీయ నిపుణులు. మొత్తానికి పీకే రాక.. బీఆర్ఎస్‌లో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు.  రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూడాలి.

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×