E-Paper
Advertisement

Dilraju: దిల్ రాజు నిజ స్వరూపం బయటపెట్టిన తేజస్విని తమ్ముడు.. ఏమన్నారంటే?

Dilraju: దిల్ రాజు నిజ స్వరూపం బయటపెట్టిన తేజస్విని తమ్ముడు.. ఏమన్నారంటే?
Advertisement

Dilraju: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు దిల్ రాజు (Dilraju). ఇప్పటికే తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బడా హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు తన నిర్మాణ సంస్థ ద్వారా పలు అవార్డులు కూడా అందుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తన వ్యక్తిగత జీవితంలో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్య అనిత మరణం తర్వాత ఆ 2020లో తేజస్విని అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు.

దిల్ రాజు నిజస్వరూపం బట్టబయలు..

వీరి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తేజస్విని ఆస్తి కోసమే దిల్ రాజును వివాహం చేసుకుందనే విమర్శలు కూడా గుప్పించారు. వీరిద్దరి వయసు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంపై ఈ దంపతులు ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేదు. కానీ తాజాగా తేజస్విని తమ్ముడు డాక్టర్ తరుణ్ ఉండవల్లి తన బావ అలియాస్ బిల్ రాజు నిజ స్వరూపం బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు..

వీరి పెళ్లిని మొదట మా ఇంట్లో ఒప్పుకోలేదు – తరుణ్

Advertisement

తేజస్విని తమ్ముడు తరుణ్ మాట్లాడుతూ..” అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. మేము బ్రాహ్మిణ్.. మా బావగారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. మా అక్క ఎయిర్ లైన్స్ సంస్థలో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలోనే దిల్ రాజుతో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ఆయన తన సినిమాలు, బిజినెస్ ల పనుల మీద విమాన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, పెళ్లి వరకు వెళ్లింది. మొదట ఈ పెళ్లికి మా ఇంట్లో మా అమ్మమ్మ ను ఒప్పించడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆమె పాతకాలం మనిషి. ఆమెను ఒప్పించేందుకు సమయం పట్టింది. కానీ మా అక్క కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము నిజానికి మా అక్క ఎయిర్ హోస్ట్ కాదు. ఆమె చదివింది మొత్తం మెడికల్ విభాగం. అనుకోకుండా ఎయిర్ లైన్స్ లో పనిచేసింది. మా అక్కను మా బావ మహారాణిలా చూసుకుంటున్నారు.

డబ్బు కోసం పెళ్లి చేసుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు – తరుణ్

డబ్బు కోసమే మా అక్క దిల్ రాజును పెళ్లి చేసుకుంది అనే మాటలు కూడా మేము వినాల్సి వచ్చింది. నిజానికి అందులో నిజం లేదు. మా కుటుంబంలో అంతా చదువుకున్న వాళ్ళమే. నేను డాక్టర్.. మా అమ్మ, మా తమ్ముడు ఇద్దరు హైకోర్టులో పనిచేస్తున్నారు. మా నాన్నకు బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. నిజానికి మాకు డబ్బుపరంగా ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కేవలం మా అక్క ఇష్టపడింది అన్న ఒక కారణంతోనే మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నామే తప్ప ఆయన ఆస్తిని మేము చూడలేదు. ముఖ్యంగా మా అక్క సంతోషంగా ఉండడమే మాకు కావాలి.. అయితే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా మా అక్కను మా బావగారు చూసుకోవడం మా అదృష్టం” అంటూ తరుణ్ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం తరుణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక దిల్ రాజు వ్యక్తిత్వం మరొకసారి బయటపడడంతో ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

ALSO READ:The RajaSaab: సెన్సార్ పూర్తి చేసుకున్న ది రాజాసాబ్.. రన్ టైమ్ లాక్!

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×