E-Paper
Advertisement

Singer Mangli: మంగ్లీపై తెలంగాణవాదులు ఆగ్రహం.. బాయిలోనే బల్లిపలికే సాంగ్ ఇక డిలీట్?

Singer Mangli: మంగ్లీపై తెలంగాణవాదులు ఆగ్రహం.. బాయిలోనే బల్లిపలికే సాంగ్ ఇక డిలీట్?
Advertisement

Singer Mangli Bayilone Ballipalike Controversy: ప్రముఖ ఫోక్‌ సింగర్ మంగ్లీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించి పాడిన బావిలోన బల్లిపలికే పాటపై తెలంగాణ ఫోక్‌ సింగర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పాటను వెంటనే డిలిట్‌ చేయాలని వారంత డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకి ఈ వివాదం ఏంటో చూద్దాం!

మరో వివాదంలో సింగర్ మంగ్లీ

సింగర్‌ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ సంస్కృతి, జానపద నేపథ్యంలో పాడుతూ పాపులర్‌ అయ్యింది. సినిమాల్లో, ప్రైవేట్‌ అల్భమ్‌ సాంగ్స్‌ మంగ్లీ మంచి గుర్తింపు పొందింది. అయితే ఈ మధ్య ఆమె తరచూ వివాదంలో చిక్కుకుంటుంది. ఇటీవల తను పాడిన బాయిలోన బల్లి పలికే పాట మేడిపల్లి స్టార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ పాటలోని లిరిక్స్‌ని ఉద్దేశిస్తూ మంగ్లీపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేశాడు. ఈ విషయంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బాయిలోన బల్లి పలికే పాట అభ్యంతరం

Advertisement

ఈ వివాదం మరవకముందే మంగ్లీ పాడిన ఈ పాట మరింత వివాదం అయ్యింది. బాయిలోన బల్లి పలికే పాట ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఈ సాంగ్‌ దూసుకుపోతుంది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాట హుక్‌ స్టెప్‌ బాగా వైరల్‌ అవుతున్నాయి. ఎక్కడ చూసిన ఈ పాట మారుమ్రోగుతుంది. అయితే ఇప్పుడు ఈ పాటపై తెలంగాణ ఫోక్‌ సింగర్స్, యాక్టివిస్ట్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద సంస్కృతిని గౌరవిస్తూ చేసిన ఈ పాటలో ఇతర రాష్ట్రాల సంస్కృతిని మిక్స్‌ చేసిందని మండిపడుతున్నారు. దీనిపై జానపద గాయకులే కాదు తెలంగాణకు చెందిన సోషల్‌ యాక్టివిస్ట్స్‌ కూడాత తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.

Also Read: Akhanda 2 : మూడు గంటలు సినిమా అవసరమా? బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

పాట కేవలం వినోదం కోసమే

Advertisement

తెలంగాణ తెలుగు పాటను గుజరాత్‌, రాజస్థాన్‌ సంస్కృతి చిత్రీకరించాల్సిన అవసరం ఏంటని, వెంటనే ఈ పాట డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే దీనిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. మరింత ముందుకు వెలుతూ భవిష్యత్తులో ఆమె పాట పాడకుండ ఆమె లైసెన్స్‌ రద్దు చేయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై సింగర్ మంగ్లీ స్పందించినట్టు సమాచారం.  ప్రేక్షకులు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు కొత్తగా ట్రే చేసిన పాట ఇదని, కేవలం వినోదం కోసమే మాత్రమే చేసిందని వివరణ ఇచ్చుకుంది. ఈ పాట వినోదంలా కాకుండ వివాదం ఎందుకు చూస్తున్నారని, ఇందులో తాను ఎక్కడ తెలంగాణ సంస్కృతిని రిప్రెజెంట్ చేయలేదని, అలాంటప్పుడు ఈ పాటను అంత వివాదం చేయడం ఎందుకని ఆమె ప్రశ్నిస్తుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×