పక్షులలో కాకులు చాలా తెలివైనవి. ప్రమాదాలను ముందే పసిగడుతాయి. ఆహారాన్ని సంపాదించుకునే విషయంలోనూ తెలివిగా ప్రవర్తిస్తాయి. కడవ అడుగులో ఉన్న నీళ్లను తాగేందుకు గుళిక రాళ్లను వేసే స్టోరీ.. కేవలం కథ కాదు.. నిజం కూడా. నీళ్లను పొందేందుకు రాళ్లు వేసిన ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో కాకి చనిపోయినప్పుడు క్షణాల్లో పదులు, వందల సంఖ్యలో కాకులు గుమిగూడుతాయి. కాసేపు గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. చాలా మంది ఆ కాకితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకు అలా చేస్తాయని భావిస్తారు. కాకుల మధ్య ఐకత్యకు ఇదో నిదర్శం అనుకుంటారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇంతకీ ఎందుకు అలా గుమిగూడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కడైనా కాకి చనిపోతే, వెంటనే పదులు, వందల సంఖ్యలో కాకులు గుమిగూడుతాయి. గట్టి గట్టిగా అరుస్తాయి. ఈ పద్దతిని బర్డ్ వరల్డ్ లో Crow funeral లేదంటే cacophony display అంటారు. ఎందుకు ఇలా చేస్తాయంటే..
⦿ ఒక కాకి చచ్చిపోతే.. దాన్ని చూసిన మొదటి కాకి గట్టిగా అరుస్తుంది. దాన్ని అలారం క్లాక్ అని పిలుస్తారు.
⦿ ఆ సౌండ్ విని పదులు, కొన్నిసార్లు వందల సంఖ్యలో కాకులు ఆ ప్రాంతానికి చేరుకుంటాయి.
⦿ అవి చచ్చిన కాకి చుట్టూ కూర్చుని లేదంటే గాలిలో తిరుగుతూ గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం కాకులలో చాలా గందరగోళం, భయం కలిగిస్తుంది.
⦿ సుమారు10 నుంచి 15 నిమిషాల పాటు ఈ అరుపులు కొనసాగుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాయి.
చనిపోయిన కాకి చుట్టూ చేరి, లేదంటే గాల్లో చక్కర్లు కొడుతూ అరవడం వెనుక దాని ప్రేమ, దానితో ఉన్న అనుబంధం కాదు. బోలెడు కారణాలు ఉన్నాయి.
⦿ ప్రమాదాన్ని గుర్తించడం: కాకి ఎలా చనిపోయింది? కారణం ఏంటి? అనే విషయాలను గుర్తించే ప్రయత్నం చేస్తాయి.
⦿ ప్రమాదాన్ని గుర్తుపెట్టుకోవడం: కాకి చనిపోవడానికి కారణం ఏంటి? తమకు అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తాయి.
⦿ కీలక హెచ్చరిక: ఇతర కాకులకు ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని అని గట్టిగా సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి.
మొత్తంగా చనిపోయిన కాకి దగ్గర మిగతా కాకులు అరవడం వెనుక బాధ కాదు, సర్వైవల్ స్ట్రాటజీ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చచ్చిన కాకి చుట్టూ మిగతా కాకులు ప్రమాదం ఏంటో ఇన్వెస్టిగేట్ చేసి, భవిష్యత్తులో జాగ్రత్త పడటానికి సమావేశం అయినట్లు భావించాలి.
నిజానికి కాకులు మనుషుల ముఖాలను కచ్చితంగా గుర్తుంచుకుంటాయి. ఒకవేళ వాటికి హాని చేయాలని చూస్తే, చాలా కాలం ఆ వ్యక్తి మీద పగను పెంచుకుంటాయి. ముఖానికి మాస్క్ వేసుకున్నా అవి ఈజీగా గుర్తుపడుతాయి. అంతేకాదు, సామాజిక ఇంటెలిజెన్స్ కూడా బలంగా ఉంటుంది. కాకులు బృందాలుగా పని చేసి, ఒకదానికొకటి సాయం చేసుకుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా అఉంటాయి. ఒక్కో భావాన్ని వ్యక్తం చేసేందుకు ఒక్కో శబ్దంతో సిగ్నల్స్ ఇస్తాయి.
Read Also: ఆది యోగిగా మారిన బుడ్డొడ్డు.. అలా ఎందుకు చేశాడంటే?