E-Paper
Advertisement

Movie Ticket Price: ప్రభాస్, చిరు సినిమాలకు భారీ ఊరట.. హైకోర్టు గుడ్ న్యూస్!

Movie Ticket Price: ప్రభాస్, చిరు సినిమాలకు భారీ ఊరట.. హైకోర్టు గుడ్ న్యూస్!
Advertisement

Movie Ticket Price:2026 సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి పెద్ద హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జనవరి 9 ప్రభాస్ (Prabhas ) ది రాజాసాబ్ (The Raja Saab) సినిమాతో సంక్రాంతి సినిమాల పండుగ ప్రారంభం కానుంది. అంతా బాగానే ఉన్నా సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి లేక గత కొంతకాలంగా నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభాస్, చిరంజీవి (Chiranjeevi) మూవీ నిర్మాతలకు భారీ ఊరట కలిగింది అని చెప్పవచ్చు

ప్రభాస్ , చిరు మూవీలకు హైకోర్టు శుభవార్త..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు ప్రభాస్, చిరంజీవి తమ సినిమాల టికెట్ రేట్ల పెంపుపై హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో అప్పీలు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతి కోసం ఈ రెండు చిత్రాల నిర్మాతలు అప్పీలు దాఖలు చేసుకున్నారు. ఇక గతంలో టికెట్టు ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు అప్పీలు చేసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. ఇక విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ చిత్రాల నిర్మాతలకు భారీ ఊరట కలిగించింది. ది రాజా సాబ్ , మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతల అప్పీలును పరిగణలోకి తీసుకొని టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ విషయం ఈ రెండు చిత్రాల నిర్మాతలకు శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప 2, ఓజీ , గేమ్ చేంజర్ , అఖండ 2 చిత్రాలకే పరిమితం చేయడం గమనార్హం.

మిగతా చిత్రాల సంగతేంటి?

Advertisement

ఈ సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 9న మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమా విడుదల కాబోతోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. తర్వాత శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి , నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేటు పెంచుకోవడమే కాకుండా అదనపు షోలకు అనుమతి లభించింది. అయితే ఇదే సంక్రాంతికి మిగతా సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి కదా.. మరి వాటి సంగతేంటి? అసలు ఈ చిత్రాలకు టికెట్ రేటు పెంచుకునే అవకాశం కల్పిస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.

also read:Jana Nayagan: జన నాయగన్ రీమేక్ కాదు.. ఇదెక్కడి లాజిక్?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×