E-Paper
Advertisement

Royal Enfield Bullet: రాయల్ ఎన్ఫీల్డ్ షాకింగ్ డెసిషన్.. ఆ బైక్స్ ధరల పెంపు!

Royal Enfield Bullet: రాయల్ ఎన్ఫీల్డ్ షాకింగ్ డెసిషన్.. ఆ బైక్స్ ధరల పెంపు!
Advertisement

Royal Enfield Bikes Price Hike: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యువత కూడా ఈ బైక్స్ ను నడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కంపెనీ కూడా యువతకు నచ్చే అద్భుతమైన బైక్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా వచ్చిన బైక్స్ బుల్లెట్ 350, క్లాసిక్ 350. ఇండియాలో ఈ బైక్స్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ 350, క్లాసిక్ 350 ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడళ్ల ధరల పెరుగుదల రూ. 2,025 వరకు ఉంది.

బుల్లెట్ 350 కొత్త ధరలు

⦿ బెటాలియన్ బ్లాక్: ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. రూ. 1,62,161 కొత్త ధర రూ. 1,63,793కు చేరింది. మొత్తంగా ఈ బైక్ మీద రూ. 1,632 పెరిగింది.

Advertisement

⦿ మిలిటరీ బ్లాక్: ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. 1,62,795 ఉండగా, కొత్త ధర రూ. 1,64,423కి చేరింది. రూ. 1,628 పెరిగింది.

⦿ మిలిటరీ రెడ్: ప్రస్తుత ధర రూ. 1,62,795 కాగా, కొత్త ధర రూ. 1,62,795గానే ఉంది. దీని మీద ఎలాంటి పెంపు లేదు.

Advertisement

⦿ స్టాండర్డ్ బ్లాక్ / స్టాండర్డ్ మెరూన్: ప్రస్తుత ధర రూ. రూ. 1,85,187 కాగా, పెరిగిన ధర రూ. 1,87,038గా ఉంది. పెంపు రూ. 1,851గా ఉంది.

⦿ బ్లాక్ గోల్డ్: ఈ బైక్ ప్రస్తుత ధర రూ. 2,02,409 కాగా, పెరిగిన ధర రూ. 2,04,434గా ఉంది. మొత్తంగా రూ. 2,025 పెరిగింది.

ప్రస్తుతం స్వల్పంగా ఈ బైక్ ధర పెరిగినా, ప్రీమియం అంత ఎక్కువగా లేదు. బుల్లెట్ 350ని కొనుగోలు చేయాలనుకునే వాళ్లు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

క్లాసిక్ 350 కొత్త ధరలు

⦿ రెడిచ్ రెడ్: ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. 1,81,118 ఉండగా, కొత్త ధర రూ. 1,82,658కి చేరింది. రూ. 1,540 పెరిగింది.

⦿ హాల్సియాన్ బ్లాక్: ప్రస్తుత ధర రూ. 1,83,784 కాగా, పెరిగిన ధర రూ. రూ. 1,85,347.  మొత్తంగా రూ. 1,563 పెరిగింది.

⦿ మద్రాస్ రెడ్ / జోధ్‌పూర్ బ్లూ: ఈ బైక్ ధర రూ. 1,87,141 ఉండగా, పెరిగిన ధర రూ. 1,88,732కి చేరింది. మొత్తంగా రూ. 1,591 పెరిగింది.

⦿ మెడలియన్ బ్రాంజ్: ఈ బైక్ ధర రూ. 1,91,366 కాగా, పెరిగిన ధర రూ. రూ. 1,92,994కి చేరింది. మొత్తంగా రూ. 1,628కు చేరింది.

⦿ కమాండో సాండ్: ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. రూ. 2,02,617 ఉండగా, పెరిగిన ధర రూ. 2,04,340కి చేరింది. రూ. 1,723 పెరిగింది.

⦿ గన్ గ్రే / స్టెల్త్ బ్లాక్: ప్రస్తుతం రూ. 2,11,062 ఉండగా, రూ. 2,12,856కి పెరిగింది. ఈ బైక్ మీద ధర పెంపు రూ. 1,794గా ఉంది.

⦿ ఎమరాల్డ్:  ప్రస్తుత ధర రూ. 2,15,750 కాగా, పెరిగిన ధర ప్రకారం రూ. 2,17,585కు చేరింది. మొత్తంగా ఈ బైక్ మీద

రూ. 1,835 హైక్ అయ్యింది.

Read Also: రూ. 12 వేల విలువైన యాక్సెసరీస్ ఫ్రీ, ట్రయంఫ్ క్రేజీ న్యూ ఇయర్ ఆఫర్!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×