BigTV English

D Boss Darshan : టాలీవుడ్‌ను దారుణంగా అవమానించిన కన్నడ న్యూస్ చానెల్.. మర్డర్ చేసినోడు హీరోనా?

D Boss Darshan : టాలీవుడ్‌ను దారుణంగా అవమానించిన కన్నడ న్యూస్ చానెల్.. మర్డర్ చేసినోడు హీరోనా?

D Boss Darshan : కన్నడ హీరో దర్శన్ (Darshan) పై గత ఏడాది కాలం నుండి ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే హీరోలు ఈ రేంజ్ లో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ వీరాభిమానులే.. కానీ అలాంటి వీరాభిమానులను అవమానించేలా అభిమానానికి మచ్చ తెచ్చారు కన్నడ నటుడు దర్శన్. ఈయన తన వీరాభిమానిని చంపించి జైలుకి కూడా వెళ్లారు. అయితే అలాంటి కన్నడ నటుడు దర్శన్ తన అభిమానిని చంపి కూడా హీరో అయ్యారు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళకి. ఎందుకంటే ఆ న్యూస్ ఛానల్ లో వచ్చిన ప్రసారం అలా ఉంది.. ప్రస్తుతం ఆ న్యూస్ ఛానల్ లో దర్శన్ ని హీరోను చేస్తూ.. మన తెలుగు హీరోలందరినీ జీరోలను చేస్తూ ప్రసారం చేసిన ఒక వీడియో మాత్రం తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా హార్ట్ చేసింది. ఇక కన్నడ (Kannada) లో పాపులర్ అయిన ఈ ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్లపై తెలుగు అభిమానులందరూ ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ కన్నడ న్యూస్ ఛానల్లో ఏం చూపెట్టారు.. తెలుగు ఆడియన్స్ అంతలా మండిపడడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


హత్య చేసిన వాడు హీరోనా.. తెలుగు ఫ్యాన్స్ అసహనం..

కన్నడ నటుడు దర్శన్ అభిమానిని చంపినా కూడా తెలుగు హీరోలందరూ ఆయన ముందు వేస్ట్ పనికిరారు అన్నట్లుగా చూపించారు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళు.. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు సింహం రేంజ్ లో హీరో దర్శన్ ని చూపిస్తూ కింద కుక్కల రూపంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ(Telugu Film Industry)లోని హీరోలను చూపిస్తూ టాలీవుడ్ హీరోలను దారుణంగా అవమానించారు. అంతేకాదు దర్శన్ కాళ్ళ కింద తెలుగు హీరోలు ఉన్నారన్నట్లుగా చూపించడం ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కి అస్సలు నచ్చడం లేదు. దీంతో ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రసారం చేసిన తీరుపై తెలుగు ఆడియన్స్ మండి పడుతున్నారు. అభిమానిని చంపిన వాడు హీరో.. అభిమానులు ప్రాణాపాయంలో ఉన్నారంటే కోట్లు ఖర్చు పెట్టే మా తెలుగు హీరోలు జీరోలా.. అసలు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ ఆ న్యూస్ ఛానల్ పై మండిపడుతున్నారు.


బహిరంగ క్షమాపణ చెప్పాలి – తెలుగు ఫ్యాన్స్ డిమాండ్..

ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు ఎక్స్ ఖాతాలో వైరల్ అవ్వడంతో చాలామంది తెలుగు ఆడియన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలను అవమానించినట్టు చూపించినందుకు గానూ ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు వెంటనే తెలుగు ఇండస్ట్రీకి క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి క్షమాపణలు చెబుతారా.. లేక ఈ గొడవని మరింత ముదిరేలా చేస్తారా.? అనేది తెలియాల్సి ఉంది.

అభిమానిని చంపి, హంతకుడుగా మారిన దర్శన్..

ఇక కన్నడ హీరో దర్శన్ తన వీరాభిమాని అయినటువంటి రేణుకా స్వామి(Renuka Swamy) ని తన ప్రియురాలి కోసం హత్య చేయించాడు. దర్శన్ భార్య ఉండగానే పవిత్ర గౌడతో సహజీవనం చేశారు.అయితే ఈ విషయం నచ్చని దర్శన్ వీరాభిమాని రేణుకా స్వామి దర్శన్ భార్యకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని గ్రహించి, పవిత్ర గౌడ (Pavitra Gouda)కి వార్నింగ్ ఇస్తూ అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రేణుక స్వామి పెట్టే మెసేజ్ లు భరించలేని పవిత్ర.. దర్శన్ కి చెప్పడంతో దర్శన్ కొంతమంది గుండాలకు డబ్బులు ఇచ్చి రేణుక స్వామిని హత్య చేయించాడు. ఈ హత్య చేయడంలో దర్శన్,పవిత్ర లు కూడా పాల్గొనడంతో వీరిద్దరూ అభిమాని మర్డర్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

ALSO READ:Vijay Deverakonda: ‘ది’ ట్యాగ్ పై తొలిసారి స్పందించిన రౌడీ హీరో.. ఏమన్నారంటే?

 

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×