Aadhaar Center: ఆధార్ కార్డు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మానవుడితో లింకైపోయింది. ఈ పేరు ఎత్తితే చాలు చాలామంది కంగారు పడతారు. తప్పలను సరి చేసుకోవాలని చాలామంది కేంద్రాలకు వెళ్తుంటారు. పట్టణాలు, నగరాల్లో ఆ సెంటర్లు ఎక్కడ ఉంటాయో తెలీదు. ఆ సెంటర్ వెతకడానికి గంటల కొద్దీ సమయం తీసుకుంటుంది. అయినా సరైన సమాధానం చెప్పరు. ఇకపై ఆ సమస్యకు ఫుల్‌స్టాప్ పడినట్టే. కేవలం సింగిల్ క్లిక్‌తో ఆధార్ సెంటర్ ఎక్కడుందో గుర్తు పట్టేయవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఆధార్ కేంద్రాల సమాచారం గురించి తెలుసుకోవడం ఇకపై సులువు కానుంది. దీన్ని పరిష్కరించేందుకు భువన్ పోర్టల్ వచ్చింది. దీనిద్వారా ఆధార్ సెంటర్ ఎక్కడుందో ఒకే ఒక్క క్లిక్‌తో గుర్తు పట్టేయవచ్చు. భారత విశిష్ట ప్రాధికార సంస్థ-UIDAI ఇస్రోకు అనుబంధంగా ఉండే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి భువన్ ఆధార్ పేరిట పోర్టల్‌ను ప్రారంభించింది.
దీనివల్ల ఆధార్ కార్డు దారులు మూడు రకాల సమాచారాన్ని పొందవచ్చు. సమీపంలో ఆధార్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. తాము ప్రస్తుతం ఉన్న ఏరియా నుంచి వాటి దగ్గరకు వెళ్లేందుకు రూట్ మ్యాప్‌ను అందిస్తుంది. చివరగా మీకు అవసరమైన సేవలు ఆధార్ కేంద్రాల్లో లభిస్తాయా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. అంతేకాదు ఎంత దూరంలో ఆధార్ సెంటర్ కావాలి అనేది ఎంపిక చేసుకోవచ్చు.
తొలుత https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar/ భువన్ ఆధార్ పోర్టల్‌కు వెళ్లండి. స్క్రీన్ ఓపెన్ కాగానే మీ చేతికి ఎడమ వైపు నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. తొలుత దగ్గరలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆప్షన్‌ని ఎంచుకోండి. దగ్గర్లో ఆధార్ కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆధార్ సేవా కేంద్రం పేరు తెలిస్తే వెంటనే ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. రెండోది పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంటర్లు ఆప్షన్ ఉంటుంది. మీ పరిసరాల్లో ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.
ALSO READ: హానర్ X9C 5G ఇండియాలో లాంచ్.. 108 మెగా పిక్సెల్ కెమెరాతో స్పెషల్ ఫీచర్
ఒకవిధంగా చెప్పాలంటే పెద్ద పెద్ద నగరాల్లో ఆధార్ సెంటర్ గురించి తెలుసుకోవడానికి వినియోగదారులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. భువన్ పోర్టల్ ద్వారా ఆధార్ సెంటర్లను తేలికగా గుర్తు పట్టవచ్చు. ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు కనిపించని రోజులివి. ఇంకెందుకు ఆలస్యం, ఆ విషయంలో దిగులు తీరినట్టే?