Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ తన పేరు ముందు ‘ది’ అనే ట్యాగ్ ను పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ట్యాగ్ పెట్టుకున్నప్పుడు చాలామంది ఈయనపై విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పటివరకు ఈ ట్యాగ్ పెట్టుకోవడం వెనుక అసలు కారణం పై విజయ్ దేవరకొండ స్పందించలేదు. కానీ తొలిసారి ఈ ట్యాగ్ పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు విజయ్ దేవరకొండ.
‘ ది’ ట్యాగ్ పై తొలిసారి స్పందించిన విజయ్ దేవరకొండ..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ‘ ది’ ట్యాగ్ పై స్పందిస్తూ ఊహించని కామెంట్లు చేశారు. నిజానికి ఈయన తన పేరుకు ముందు ‘ది’ అనే ట్యాగ్ ను పెట్టుకోవడం వల్ల వివాదాస్పదం కావడంతో.. దానిని తొలగించాలని కొంతమంది అభిమానులు కూడా సలహా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ట్యాగ్ పై విజయ్ స్పందిస్తూ.. “ఈ ట్యాగ్ వల్ల ఇతర హీరోలకు ఎవరికి తగలనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి” అంటూ వెల్లడించారు. మొత్తానికైతే ఈ ట్యాగ్ వల్ల తాను కూడా ఇబ్బందులు పడ్డానని డైరెక్ట్ గానే చెప్పేసారు విజయ్ దేవరకొండ..ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విజయ్ దేవరకొండ సినిమాలు..
ఇకపోతే విజయ్ దేవరకొండ ఈమధ్య సరైన సక్సెస్ పడక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేశారు. కానీ ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ ఖుషి’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా పేరు సొంతం చేసుకుంది. కానీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
కింగ్డమ్ తో రాబోతున్న విజయ్ దేవరకొండ..
ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జూలై 4వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఇక ఆగస్టు 1వ తేదీన సినిమా విడుదల చేయాలనుకున్నారు.. కానీ ఆరోజు అష్టమి కావడంతో ఒకరోజు ముందుగానే అనగా జూలై 31వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతోనైనా విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.
ALSO READ:Vijay Deverakonda: ఇండస్ట్రీలో నాకు సపొర్ట్ లేదు.. నెపోటిజంపై రౌడీ హీరో హాట్ కామెంట్!