E-Paper
Advertisement

Biker Release:  శర్వానంద్ బైకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నిహారిక సినిమాకు పోటీగా?

Biker Release:  శర్వానంద్ బైకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నిహారిక సినిమాకు పోటీగా?

Biker Release: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో శర్వానంద్ తో పాటు చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈయన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం పలు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. అయితే త్వరలోనే శర్వానంద్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

బైక్ రేసర్ గా శర్వానంద్..

శర్వానంద్ హీరోగా బైకర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అప్పుడు వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మరో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 3వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా నుంచి రేపు ఉదయం శర్వానంద్ బైకర్ సునీల్ పాత్రను పరిచయం చేస్తూ ఒక గ్లింప్ వీడియో కూడా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలియచేశారు. ఇక బైకర్ సినిమా విడుదలరోజే నిహారిక నిర్మాణంలో సంగీత శోభన్ నటించిన దాంట్లో రాకాసా కూడ విడుదల కాబోతోంది.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా బైకర్..

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హై-ఆక్టేన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో శర్వానంద్ రేసర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శర్వానంద్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

శర్వానంద్ ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో సక్సెస్ అందుకున్నారు మరి ఇలాంటి సూపర్ సక్సెస్ అందుకున్న ఈయనకు భయంకర సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈయన శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇక ఈ సినిమాని కూడా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Kalki 2: కల్కి 2 లో సుమతిగా సాయి పల్లవి.. రూమర్లపై స్పందించిన మూవీ టీమ్!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×