E-Paper
Advertisement

‘గేట్లు మూయండిరా’.. నాగ్ 100వ సినిమా లీక్డ్ సీన్స్ చూశారా?

‘గేట్లు మూయండిరా’.. నాగ్ 100వ సినిమా లీక్డ్ సీన్స్ చూశారా?
Advertisement

Nagarjuna Leaks : సెంచరీ… క్రికెట్‌లో అయినా సినిమాల్లో అయినా దీనికుండే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. క్రికెట్‌లో కాస్త కుదురుకుంటే సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ సినిమాల్లో మాత్రం హీరోగా సెంచరీ కొట్టాలంటే అంత ఆషామాషీ కాదు. ఇక ఇండస్ట్రీలో హీరోగా వంద సినిమాలను కంప్లీట్ చేసిన వాళ్లను వేళ్ల మీద లెక్కెట్టవచ్చు. అలాంటి ఈ సినీ ఇండస్ట్రీలో వందో సినిమాను త్వరలో వదలబోతున్నాడు కింగ్ నాగార్జున. తమిళ తంబి రా. కార్తీక్ దర్శకత్వంలో సినిమా జోరుగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది.అంతా బాగానే ఉంది. కానీ సినిమా సెట్ నుండి సీన్స్ లీక్ అవడమే ఇప్పుడు మూవీ టీమ్‌కు పెద్ద తలనొప్పిలా మారింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సీన్స్ 

Advertisement

అవును.. తాజాగా సోషల్ మీడియాలో నాగార్జున భారీ ఇనుప రాడ్ పట్టుకుని, తన గ్యాంగ్‌తో కలిసి రౌడీల మీదికి వెళ్తున్న సీన్ ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది. సినిమాలో.. “గేట్లు మూయండిరా” అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ నాగ్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచినప్పటికీ, అసలు సినిమాలోని కీలక సన్నివేశం ఇలా బయటకు రావడం టీమ్ మేనేజ్‌మెంట్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది.

also read :రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!

Advertisement

ఇక మరో సీన్‌లో నాగార్జున ఒక అమ్మాయిని రౌడీ బారినుండి కాపాడే సీన్ కూడా ఒకటి లీక్ అయింది. చూస్తుంటే ఈ సీన్స్‌ను ఎవరో యూనిట్‌లో ఉన్న వాళ్లే కావాలని షూట్ చేసి బయటికి వదిలినట్టు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే కనీసం సెట్స్‌లో ఎవరు దర్జాగా సెల్ ఫోన్ పట్టుకుని షూట్ చేస్తున్నారో కూడా తెలియనంత మొద్దు నిద్రలో సెక్యూరిటీ ఉన్నట్టు అర్థమవుతుంది.నిజానికి మామూలుగా ఏ సినిమా జరిగినా చాలా పకడ్బందీగా షూటింగ్ చేస్తుంటారు మేకర్స్. అలాంటిది టాప్ స్టార్ అయిన నాగ్ వందో సినిమా మాత్రం ఇలా సీన్స్ లీక్ అయ్యేదాకా రావడం అంటే అది మేకర్స్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి.

 మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

ఇక సినిమా విషయానికి వస్తే నాగార్జునతో వెటరన్ బ్యూటీ టబు దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుంది. 1996లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ ఎంతటి సూపర్ హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ (1998)లో వీరిద్దరూ జంటగా అలరించారు. అలా రెండు సినిమాలతోనే మాంచి హిట్ పెయిర్‌గా క్రేజ్ కొట్టేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ నాగ్ 100వ సినిమా కోసం జత కట్టడం విశేషం. ఇక టబు ఇప్పటికే ఈ సినిమాలోని తన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు మే 1, 2026న తన అఫీషియల్ ఇన్‌స్టాలో అనౌన్స్ చేసింది కూడా.

ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే దీన్ని నవంబర్ 8, 2026న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ‘రాగ్స్ టు రిచ్’ అనే స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో నాగ్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని, అందులో 25 ఏళ్ల యువకుడి గెటప్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడుతున్నారని ఇన్‌సైడ్ టాక్.

సినిమా బిజినెస్ మీద ఇంపాక్ట్ 

ఇక సినిమా ఆల్మోస్ట్ 80 శాతం కంప్లీట్ కాగా, సినిమా ఎలా వచ్చిందో చూసుకుని ప్రమోషన్స్ మొదలెడతాడట నాగార్జున. వందో సినిమా కాబట్టి బహుశా సీన్స్ సరిగ్గా రాకపోతే రీషూట్స్ ప్లాన్ చేస్తారేమో కాబోలు. ఇక సినిమాలో టబుతో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్ వంటి హీరోయిన్లు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. ఇలా సాలిడ్ అట్రాక్షన్స్ ఉన్నప్పటికీ, మూవీ నుండి ఇలాంటి లీక్స్‌ను గనుక కంట్రోల్ చేయకపోతే సినిమా బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించడం పక్కా.

చూడాలి మరి ఇప్పటికైనా ఆ లీకు వీరున్ని పట్టుకుంటారో లేక సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో వచ్చేదాకా ఆగుతారో!

also read :బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఊచకోత.. రిలీజ్‌కు ముందే

Related News

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×