E-Paper
Advertisement

దళపతి విజయ్ కాదు… సీఎం విజయ్ సర్ప్రైజ్ ఇచ్చిన జననాయగన్ టీమ్

దళపతి విజయ్ కాదు… సీఎం విజయ్ సర్ప్రైజ్ ఇచ్చిన జననాయగన్ టీమ్
Advertisement

TVK Vijay: తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హీరో విజయ్(Vijay) నటించిన ఆఖరి చిత్రం జననాయగన్(Jananayagan) విడుదలకు ఎన్నో అవంతరాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడ్డాయి. ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదని చెప్పాలి. హీరో విజయ్ చివరిగా నటించిన జననాయగన్ సినిమా రాజకీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విజయ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమా విడుదలకు అడ్డుపడ్డారు. తమిళనాడు ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలలో టీవీకే పార్టీ (TVK Party)తరఫున విజయ్ అద్భుతమైన విజయాన్ని అందుకొని తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్..

ఈ విధంగా విజయ్ ఊహించని విధంగా తమిళనాడు పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో జననాయగన్ చిత్ర బృందం తాజాగా ఒక టీజర్ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ టీజర్ వీడియోలో భాగంగా టైటిల్ కార్డ్స్ లో విజయ్ పేరును ఇంట్రడ్యూస్ చేస్తూ థలపతి విజయ్ కాకుండా గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(Tamilanadu Cheif Minister c.Joseph vijay) నటించిన జననాయగన్ అంటూ పరిచయం చేశారు. ఈ టీజర్ వీడియోలో విజయ్ పోలీస్ డ్రెస్ వేసుకొని నడిచొస్తున్న విజువల్స్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్నాయి.

దేశ రాజకీయాలలోనే తొలిసారి..

Advertisement

ఇక ఈ టీజర్ వీడియో విడుదల కావడంతో సీఎం విజయ్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ హీరోకి కూడా టైటిల్ కార్డులో ముఖ్యమంత్రి అంటూ ఎక్కడ వేయలేదు మొదటిసారి విజయ్ సినిమా టైటిల్స్ విషయంలో ముఖ్యమంత్రి విజయ్ నటించిన సినిమా అంటూ రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జననాయగన్ సినిమాని విడుదల కాకుండా అడ్డుకోవడం కొంత వరకు మంచే జరిగింది అంటూ అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి టైటిల్ కార్డ్స్ తోనే విజయ్ తన సినిమాని విడుదల చేసుకుంటున్నారు.

Advertisement

హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా విజయ్ కూతురిగా మమితా బైజు నటించారు. ఇక ఈ సినిమాకు కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా కావటం విశేషం. పార్టీ ప్రకటించిన సమయంలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెబుతారని, పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని తెలియజేశారు. అందుకు అనుగుణంగానే ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి ప్రజాసేవకే పరిమితం కానున్నారు.

Also Read: పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయాను… అంచనాలు పెంచిన ఆర్ట్ డైరెక్టర్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×