E-Paper
Advertisement

Peddi Second single: పెద్ది సెకండ్ సింగిల్ ప్రోమో.. ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీమ్!

Peddi Second single: పెద్ది సెకండ్ సింగిల్ ప్రోమో.. ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీమ్!
Advertisement

Peddi Second single:ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) తన రెండవ సినిమాను ఏకంగా గ్లోబల్ స్టార్ తో చేయడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈయన కథకు అంత బలం ఉంది కాబట్టే రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు అప్పట్లోనే వినిపించాయి.అందుకు తగ్గట్టుగానే గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ నేపథ్యంలో వస్తున్న పెద్ది సినిమా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. టికెట్ ధరల పెంపు కారణంగా ఏప్రిల్ 30వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేశారు.

పెద్ది నుంచీ సెకండ్ సింగిల్..

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా..” చికిరి చికిరి ” అంటూ వచ్చిన ఈ సాంగ్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. ఇక రెండవ పాట కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ రెండవ పాట నుంచి ప్రోమోని రిలీజ్ చేస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ మేకర్స్ మాత్రం ప్రోమో కాకుండా ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.. మరి ప్రోమోను రిలీజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

also read:Vijay – Sangeetha: విడాకుల వేళ.. కోడలి రహస్యాలు బయటపెట్టిన విజయ్ తండ్రి!

ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్..

ఇకపోతే రెండవ సింగిల్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ తోపాటు డబ్బింగ్ తో చిత్ర బృందం చాలా బిజీగా ఉంది. ఇక మరొకవైపు డైరెక్ట్ గా ఫుల్ సాంగ్ తో పాటు స్టెప్స్ చూస్తే షాక్ ఫ్యాక్టర్ ఉంటుందట. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఈ పాటను రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలోనే ప్రోమోను రిలీజ్ చేయకుండా ఒకేసారి సాంగ్ తో పాటు చరణ్ స్టెప్స్ ని చూపిస్తూ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ కారణంగానే ప్రోమోని రిలీజ్ చేయలేదట. “రాయ్ రాయ్” అంటూ సాగే ఈ రెండవ పాట కచ్చితంగా చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ పాట ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రామ్ చరణ్.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×