E-Paper
Advertisement

OTT Movie: ధర్మేంద్ర – హేమ మాలిని నటించిన ఎవర్ గ్రీన్ ఐకానిక్ సినిమాలు ఇవే

OTT Movie: ధర్మేంద్ర – హేమ మాలిని నటించిన ఎవర్ గ్రీన్ ఐకానిక్ సినిమాలు ఇవే
Advertisement

OTT Movie : బాలీవుడ్‌లో ధర్మేంద్ర-హేమ మాలిని జంటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినీప్రయాణంలో ఎన్నో సినిమాలలో వీళ్ళు ప్రేమ పక్షులు. అలాగే నిజ జీవితంలో కూడా ప్రేమించి పెళ్ళికూడా చేసుకున్నారు. అయితే ఈ జంట సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. నటుడు ధర్మేంద్ర గత సోమవారం (నవంబర్ 24) మరణించడంతో సినిమా ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ధర్మేంద్ర 89 ఏళ్ళ వయసులో ముంబైలో కన్నుమూశారు. ఈ సంఘటన ‘డ్రీమ్ గర్ల్’ హేమ మాలినికి తీరని లోటును మిగిల్చింది. ధర్మేంద్ర, హేమ మాలిని ప్రయాణం 1970ల కాలం నాటి నుంచి దాదాపు 30 సినిమాలలో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ నడిచింది. ఈ ప్రయాణమే పెళ్లి వరకు దారితీసింది. ఈ జంట నటించిన అత్యుత్తమ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

‘షరాఫత్’ (1970) – YouTube

ఇందులో ధర్మేంద్ర రాజేష్ అనే కాలేజ్ ప్రొఫెసర్ పాత్రను పోషించాడు. అతను మహిళలను జీవితంలో ముందుకు తీసుకెళ్ళే విధాననాన్ని ఇందులో చక్కగా చూపిస్తారు. ఇందులో హేమ మాలిని అతని పనులను చాలా గౌరవిస్తుంటుంది. ప్రేమలో కూడా పడుతుంది.

‘సీతా ఔర్ గీతా’ (1972) Youtube

Advertisement

సౌమ్యంగా ఉండే సీత పాత్రలోనూ, కోపంగా ఉండే గీత పాత్రలోనూ డ్యూయల్ రోల్ లో నటించిన హేమ మాలిని, డ్రీమ్ గర్ల్ గా తన హోదాను పదిలం చేసుకుంది. ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సాధించింది. ధర్మేంద్ర పోషించిన రాకా పాత్రకి కూడా మంచి ఆదరణ వచ్చింది. ఈ జంట ఎంత ప్రజాదరణ పొందిందో మరోసారి నిరూపించారు.

‘షోలే’ (1975) – ప్రైమ్ వీడియో

భారతీయ చిత్రాలలో ఇప్పటివరకు నిర్మించిన గొప్ప సినిమాగా ఈ మూవీ పేరు సంపాదించింది. ఇందులో ధర్మేంద్రను ప్రేమించే హేమ మాలినిని, ఒక గుర్రపు బండి నడిపే పల్లెటూరి అమ్మాయి బసంతిగా చూపించారు. వీళ్ళ ప్రేమ కూడా ఈ సినిమాతోనే మొదలైనట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ సినిమాతో ఈ జంట వెనిక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

‘ప్రతిగ్య ‘ (1975) – YouTube

Advertisement

ఈ సినిమాలో ధర్మేంద్ర అజిత్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ పాత్రలో నటించాడు. తన కుటుంబాన్ని క్రూరమైన భరత్ ఠాకూర్ అనే బందిపోటు చంపాడని తెలుసుకుంటాడు. ఆ బందిపోటు గ్రామమైన దినాపూర్‌లో, అజిత్ ప్రతీకారం తీర్చుకుంటూ పోలీసు అధికారిగా నటిస్తాడు. ఇందులో బందిపోటు దొంగకి మేనకోడలు రాధ పాత్రలో హేమ మాలిని నటించింది.

‘దిల్లగి’ (1978) Youtube

ఈ రొమాంటిక్ సినిమాలో ధర్మేంద్ర తన యాక్షన్ ఇమేజ్‌కి విరుద్ధంగా, సౌమ్యంగా ఉండే ఒక సంస్కృత ప్రొఫెసర్ పాత్రను పోషించాడు. హేమ మాలిని ఫూల్రేను అనే డేరింగ్ ప్రొఫెసర్ పాత్రను ఇందులో పోషించింది. వీళ్ళ వ్యక్తిత్వాలు వేరైనప్పటికీ, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది. మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కథను ఆసక్తికరంగా నడిపిస్తాయి.

‘దిల్ కా హీరా’ (1979) Youtube

ఇందులో ధర్మేంద్ర రజత్ శర్మ అనే కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఈ స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఈ జంట కెమిస్ట్రీ ప్రజాదరణ ఎంతగానో పొందింది.

 

Read Also :  దేవుడి విగ్రహాలపై రాక్షసుడి కన్ను… శాపంతో శవాలుగా మారే ఊరి జనం… గుండె ఝల్లుమనిపించే సినిమా

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×