E-Paper
Advertisement

Summer Holidays: ‘సమ్మర్ హాలిడేస్’ అంటూ రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్!

Summer Holidays:  ‘సమ్మర్ హాలిడేస్’ అంటూ రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్!
Advertisement

Summer Holidays: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా ప్రతివారం చిన్న హీరోల సినిమాల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి నెలలో కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలా ఫిబ్రవరిలో విడుదల కాబోయే సినిమాలలో కపుల్ ఫ్రెండ్లీ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నిర్మాత ధీరజ్ మొగిలినేని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ధీరజ్ నిర్మాణంలో త్వరలో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

ధీరజ్ మొగిలినేని సమ్మర్ హాలిడేస్..

ధీరజ్ ఇదివరకే ఎన్నో సినిమాలకు నిర్మాతక వ్యవహరించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన సమ్మర్ హాలిడేస్ (Summer Holidays)అంటూ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు .ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ ను పురస్కరించుకొని మే ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.. ఇక ఈ సినిమాలో నటినటుల విషయానికి వస్తే..90s సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ రోహన్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

సమ్మర్ హాలిడేస్ మే 1 న విడుదల..

Advertisement

రోహన్ తోపాటు 35 చిన్న కథలు కాదు సినిమాలో చిన్న కుర్రాడు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు .అదేవిధంగా చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి పెద్ద కూతురు పాత్రలో నటించిన చిన్నారి కూడా ఈ సినిమాలో భాగం కాబోతోందని తెలుస్తోంది. సరికొత్త కథతో ఈ సమ్మర్ హాలిడేస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ధీరజ్ మొగిలినేని సినిమాలు..

Advertisement

ఈ నేపథ్యంలోనే సమ్మర్ హాలిడేస్ సినిమాతో సమ్మర్ హాలిడేస్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారకంగా వెల్లడి కానున్నాయి. ఇక ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో ఇప్పటి వరకు ది గర్ల్ ఫ్రెండ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, నరుడు బ్రతుకు నటన అనే సినిమాలకు నిర్మాత సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Ramcharan Upasana: మెగా ట్విన్స్ రాక.. ఎలిఫెంట్ థీమ్ తో అదిరిపోయే గిఫ్ట్.. క్రేజీగా ప్లాన్ చేసిన చరణ్ ఉపాసన!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×