E-Paper
Advertisement

Yellampet Municipality: రాజ్‌బొల్లారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత..?

Yellampet Municipality: రాజ్‌బొల్లారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత..?
Advertisement

Yellampet Municipality: స్వేఛ్చ బ్యూరో: మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌బొల్లారం(Rajbollaram) గ్రామం లో 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాణి నారాయణ గౌడ్ ఎన్నికల ప్రచారానికి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌బొల్లారం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయం ముందు నిర్వహించిన సమావేశంలో వజ్రేష్ యాదవ్ ప్రసంగించారు.

కార్యకర్తల మధ్య వాగ్వాదం

ఆయన ప్రసంగంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Malla Reddy)పై తీవ్ర విమర్శలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్(BRS) పార్టీ 6వ వార్డు అభ్యర్థి సుగుణ రమేష్‌ను బకరా చేస్తున్నారని వ్యాఖ్యానించడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి సుగుణ రమేష్, తమ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు అవాస్తవమని, మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి సొంత నిధులతో గ్రామంలో రోడ్లు వేసి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

Advertisement

Also Read: Alipay+ India UPI: ఇండియాలో చైనా యుపిఐ.. గూగుల్‌పే, ఫోన్‌పేతో ఢీ

స్థానిక నాయకుల జోక్యంతో..

దీనికి ప్రతిగా కాంగ్రెస్ అభ్యర్థి రాణి నారాయణ గౌడ్ , బీఆర్ఎస్ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనంతరం వజ్రేష్ యాదవ్ మళ్లీ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో కొంతసేపు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) కార్యకర్తల నినాదాలతో ప్రాంతం హోరెత్తింది. స్థానిక నాయకుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Advertisement

Also Read: Sri Chidambaram Garu: నా సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×