E-Paper
Advertisement

The Kerala Story 2: ఆ సీన్లు 50 శాతం వరకు కట్.. ది కేరళ స్టోరీ 2 సెన్సార్ కట్స్ ఇవే..!

The Kerala Story 2: ఆ సీన్లు 50 శాతం వరకు కట్.. ది కేరళ స్టోరీ 2 సెన్సార్ కట్స్ ఇవే..!
Advertisement

The Kerala Story 2 Censor Cuts: బాలీవుడ్‌లో ఇప్పటికే భారీ వివాదాలకు కారణమైన The Kerala Story 2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే విడుదలకు ముందు సెన్సార్ బోర్డు (CBFC) కీలక నిర్ణయాలు తీసుకోవడంతో సినిమా చుట్టూ వివాదం మరింత పెరిగింది.

సెన్సార్ బోర్డు తీరు ఎలా ఉందంటే..!

సినిమాలోని కంటెంట్ సున్నితమైనదిగా ఉండటంతో..చాలా మంది దీనికి అడల్ట్ సర్టిఫికేట్ వస్తుందని భావించారు. కానీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 16+ రేటింగ్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు నిండిన వారు ఈ సినిమాను చూడవచ్చని అర్థం. అదే సమయంలో సినిమాపై కొన్ని కఠినమైన షరతులు కూడా విధించింది.

ఏకంగా 50% కట్..!

Advertisement

CBFC ఆదేశాల ప్రకారం సినిమా నుంచి మొత్తం 16 సన్నివేశాలను తొలగించారు. ముఖ్యంగా రేప్‌కు సంబంధించిన దృశ్యాలు, అలాగే ముద్దు సన్నివేశాల్లో దాదాపు 50 శాతం వరకు కత్తిరించారు. దీనితో పాటు కొన్ని డైలాగులు, చిన్న సీక్వెన్సులు కూడా తీసివేశారు. ఈ మార్పుల తర్వాత సినిమా తుది నిడివి 2 గంటలు 11 నిమిషాలుగా ఖరారైంది.

ఇంతేకాదు..సినిమా మొదట్లో తప్పనిసరిగా రెండు నిమిషాల డిస్క్లెయిమర్ వేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఈ డిస్క్లెయిమర్‌లో వాయిస్ ఓవర్ ఉండాలి. అలాగే ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని స్పష్టంగా చెప్పాలని సూచించింది.

Advertisement

ఈ సినిమా కేరళలో జరుగుతున్న బలవంతపు మత మార్పిడుల అంశాన్ని చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. దీనిపై కేరళ హైకోర్టులో కేసు కూడా దాఖలైంది. సినిమా కేరళను ప్రతికూలంగా చూపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. నిజ సంఘటనల ఆధారమని చెప్పడం వల్ల రాష్ట్ర ప్రతిష్టపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.

అందుకే సినిమా అధికారిక విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శన (స్పెషల్ స్క్రీనింగ్) నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఆ స్క్రీనింగ్ అనంతరం మాత్రమే కేరళలో సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ది కేరళ స్టోరీ 2.. విడుదలకు ముందే భారీ చర్చలకు దారి తీసింది. సెన్సార్ కత్తిరింపులు, కోర్టు ఆదేశాలు, వివాదాస్పద కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా కలిగిస్తోంది. సినిమా విడుదల తర్వాత ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ALSO READ: Kamal Haasan vs Rajinikanth Networth: రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్..2026లో ఎవరి నెట్ వర్త్ ఎంతంటే..?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×