E-Paper
Advertisement

GHMC Commissioner: పనుల్లో వేగం పెంచాలి.. అభివృద్ది పనులపై కమిషనర్ కర్ణన్ ఆదేశం

GHMC Commissioner: పనుల్లో వేగం పెంచాలి.. అభివృద్ది పనులపై కమిషనర్ కర్ణన్ ఆదేశం
Advertisement

GHMC Commissioner: మహానగరంలో పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా పెరుగుతున్న ట్రాఫిక్ ట్రాఫిక్​ ఇబ్బందులు దూరం చేసేందుకు చేపట్టిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్(ఎస్ఆర్ డీపీ), హెచ్ సిటీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిషనర్ నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్ లలో చేపడుతున్న ఎస్ఎన్ డీపీ, హెచ్ – సిటీ ప్రాజెక్టులు, ఎస్ఆర్ డీపీ పనుల పురోగతి పై జోనల్ కమిషనర్లు, ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు, ప్లానింగ్, ఇరిగేషన్, భూ సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్ కు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను, క్షేత్ర స్థాయి సవాళ్లు, పెండింగ్ పనులు, అందుకు గల కారణాలను తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల వేగంగా పూర్తికి కమిషనర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్ట్ ల పనులకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు.

Also Read: Coconut Water: రోజులో కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?

జూన్ 2 వ తేదీ కల్లా పూర్తి చేయాలి 

Advertisement

యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమైనా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంటే తనకు తెలియజేస్తే వెంటనే క్లియర్ చేస్తానని తెలిపారు. హెచ్ సిటీ , ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ కింద చేపట్టిన పనులపై ఫోకస్ పెట్టి వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రగతిలో ఉన్నముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి, నల్గొండ ఎక్స్ రోడ్డు ఫ్లై ఓవర్ పనులను మిషన్ మోడ్ లో చేస్తూ జూన్ 2 వ తేదీ కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కే బి ఆర్ పార్క్ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరిగేలా చూడాలని సూచిచారు. పనులు జరిగే ప్రదేశాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీస్ లతో ప్లాన్ చేసుకోవాలని కమినర్ సూచించారు. జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, జి. ముకుంద రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తో పాటు ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు కూడా పాల్గొన్నారు.

చెత్త సేకరణ మరింత బలోపేతం చేస్తాం

నూటికి నూరు శాతం డోర్ టూ డోర్ చెత్త సేకరణ జరిగేలా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. జవాబుదారీ తనం పెరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ఉదయం రాజేంద్ర నగర్ జోన్ అత్తా పూర్ సర్కిల్ పరిధిలోని హైదర్ గూడ నలందనగర్ లో క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్ టు డోర్ చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్టు అమలును జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ (శానిటేషన్) రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి పరిశీలించారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ పనితీరును జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి కమిషనర్ కు వివరించారు.

ఆకస్మికంగా తనిఖీ

Advertisement

అనంతరం స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటా చెత్త సేకరిస్తున్న తీరును కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛ ఆటో కార్మికులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేసేలా పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ కమిషనర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈఈ, ఏఈ లను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు చెత్తని అందించని ఇండ్లు ఏమైనా ఉంటే గుర్తించి, వారు తప్పనిసరిగా చెత్త అందించేలా మోటివేట్ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరు, సూపర్ వైజర్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.

Also Read: Pradeep Ranganathan: రూ. 50 లక్షల నుంచి రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ వరకు.. ప్రదీప్ క్రేజ్ ఇది!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×