E-Paper
Advertisement

Indian Railway: పని చేయని ఉన్నతాధికారులకు షాక్, ఆరుగురిని ఇంటికి పంపించిన ఇండియన్ రైల్వే!

Indian Railway: పని చేయని ఉన్నతాధికారులకు షాక్, ఆరుగురిని ఇంటికి పంపించిన ఇండియన్ రైల్వే!
Advertisement

Indian Railway Non-performing Officers: భారతీయ రైల్వే ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెట్టింది. అధికారులు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించింది. ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు, పని తీరు బాగాలేని ఆరుగురు రైల్వే అధికారులపై చర్యలు తీసుకుంది. ఆరుగురిని బలవంతంగా పదవీ విరమణ చేయించింది. భారతీయ రైల్వే ఎస్టాబ్లిష్‌మెంట్ కోడ్ (IREC), వాల్యూమ్ 2లోని రూల్ 1802(a) కింద ఈ చర్యలు తీసుకుంది.

పదవీ విరమణ చేసిన అధికారులు ఎవరంటే?

పని తీరు బాగాలేక పదవీ విరమణ చేసిన అధికారులలో నార్తర్న్ రైల్వేలో CME/ప్రాజెక్ట్/HQ, SWRలో NF-HAG/IRSME,  SECRలో SAG/ISRE, ERలో SAG/IRSSE, RBSSలో గ్రేడ్-1, RBSSSలో PPS వంటి పదవులను నిర్వహించిన వారు ఉన్నారు.  ఈ నిర్ణయంతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది పని తీరు విషయంలో ఎంత సీరియస్ గా ఉందో అర్థం అవుతుంది. ఈ చర్య సంస్థలోని ఏ స్థాయిలోనైనా పనితీరు లోపాన్ని, అసమర్థతను సహించబోమని వార్నింగ్ ఇస్తోంది. రైల్వే అధికారులు, ఉద్యోగులు చర్యను తీవ్రంగా పరిగణించాలని భావిస్తున్నారు.

రైల్వేలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం

Advertisement

ఇంతకు ముందు, భారతీయ రైల్వే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ఎక్యుప్ మెంట్స్,   స్మార్ట్ పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతను, ఆపరేషనల్ సామర్థ్యాన్ని చురుకుగా మెరుగుపరిచింది. పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో లోకో పైలట్‌లకు సహాయపడటానికి రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా ‘ట్రై-నేత్ర’ వ్యవస్థను అభివృద్ధి చేసింది. వీల్స్, బేరింగ్స్ హెల్త్ ను రియల్ టైమ్ లో పర్యవేక్షించడానికి 24 వీల్ ఇంపాక్ట్ లోడ్ డిటెక్టర్స్ (WILD) వ్యవస్థలు, 25 ఆన్‌ లైన్ మానిటరింగ్ ఆఫ్ రోలింగ్ స్టాక్ (OMRS) వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలో ఆప్టికల్ కెమెరాలు, ఇన్‌ఫ్రా రెడ్ కెమెరా, రేంజింగ్ పరికరాలు, AI ఉన్నాయి. ఇవి లోకో పైలట్లకు సాయపడటానికి రియల్ టైమ్, మెరుగైన విజన్ వ్యవస్థను అందిస్తాయి.

రన్నింగ్ రైళ్లు, రైల్వే ట్రాక్‌ లలో లోపాలను గుర్తించడం కోసం,  మెషిన్ విజన్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్స్ (MVIS),ఇంటిగ్రేటెడ్ ట్రాక్ మానిటరింగ్ సిస్టమ్స్ (ITMS)ను కూడా పైలట్ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. మెరుగైన ట్రాక్ మెయింటెనెన్స్ ప్లానింగ్, మొత్తం కార్యాచరణ సామర్థ్యం కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు.

Advertisement

ఇక MVIS అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థ. ఇది కదులుతున్న రైళ్లలో లూజ్ అయిన భాగాలను గుర్తించి హెచ్చరిస్తుంది. ఫ్రైట్ స్టాక్ కోసం పైలట్ ప్రాతిపదికన, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేలో 3 MVISలు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 2, ఆగ్నేయ సెంట్రల్ రైల్వేలో 1 దాన్ని ఇన్ స్టాల్ చేశారు. అటు ట్రాక్ భాగాల ఏఐ ఆధారిత తనిఖీ, పర్యవేక్షణ కోసం 3 ఇంటిగ్రేటెడ్ ట్రాక్ మానిటరింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు.

Read Also: రైల్వేలో అక్రమ విక్రేతలకు చెక్.. QR కోడ్‌ తో కొత్త విధానం అమలు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×