E-Paper
Advertisement

“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!

“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!
Advertisement

Rahul Sipligunj’s Emotional Tribute: రాహుల్ సిప్లిగంజ్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు…ఇక ఈక్రేజీ సింగర్ RRRలో పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డ్ ని కొట్టేసింది కూడా. అలాంటి పాపులర్ సింగర్ తాజాగా తన మ్యూజిక్ జర్నీ ఈ స్థాయికి రావడానికి సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి ప్రోత్సాహం ఎంతో ఉంది కూడా.అలాంటి కీరవాణి తో జాగా రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పిక్, దానికి జత చేసిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కీరవాణి కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేసిన రాహుల్ 

Advertisement

విషయంలోకి వెళ్తే రాహుల్ ఈ మధ్యే ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఒక డ్రీమ్ బైక్‌పై ఎం. ఎం. కీరవాణి కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేశాడు.ఇక ఈ పిక్‌కి రాహుల్ “నా సంగీత ప్రయాణంలో నన్ను నమ్మి నిలబెట్టిన నా గురువు గారు.. ఈరోజు నా కష్టార్జితంతో కొనుక్కున్న డ్రీమ్ బైక్ రైడర్ సీట్‌లో కూర్చోవడం నాకు నిజంగా ఒక ‘ఫుల్ సర్కిల్ మోమెంట్'” అని ఒక అందమైన కోట్ రాసుకొచ్చాడు. తనకి ఆస్కార్ రేంజ్ పాటని ఇచ్చి ఎంకరేజ్ చేసిన గురువుని ఇలా గౌరవించడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే.ఇక ఫోటో చూసిన నెటిజన్లు కూడా గురువుకు శిష్యుడు ఇచ్చే నిజమైన గౌరవం అంటే ఇదేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తుండటం విశేషం.

గుర్తొచ్చేది ‘RRR’లోని ‘నాటు నాటు’ పాటే

Advertisement

ఇక రాహుల్ సిప్లిగంజ్ – కీరవాణి గారి కాంబినేషన్ అనగానే మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది ”RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటే. 2022 మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక ఆ పాటకి 2023 మార్చి 12న ఆస్కార్ అవార్డు వచ్చిన సమయం లో లాస్ ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో రాహుల్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తెలుగు వారి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాడు కూడా.

also read :బాలయ్య బాబు హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. క్లారిటీ వచ్చేసింది!

ఇక చాలా సార్లు గ్లోబల్ వేదికపై పాడుతున్నప్పుడు కూడా కీరవాణి ఇచ్చిన ధైర్యమే తనని ముందుకు నడిపించిందని రాహుల్ చెప్పాడు కూడా .అయితే నాటు నాటు కంటే ముందే కీరవాణి దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్స్ పాడాడు రాహుల్. రాజమౌళి దర్శకత్వంలో 2012 జూలై 6న వచ్చిన ‘ఈగ’ సినిమాలో హే పిల్ల తోఫాన్, అలాగే 2015 జూలై 10న వచ్చిన ‘బాహుబలి ది బిగినింగ్’లో ఎవడో ఒకడు, 2017 ఏప్రిల్ 28న వచ్చిన ‘బాహుబలి 2 ద కన్క్లూజన్’లో సాహోరే బాహుబలి వంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్‌ రాహుల్‌ కి ఇచ్చి తన కెరీర్ ని మరో రేంజ్ కి తీసికెళ్ళడం వల్లే ఇలా గుర్తు పెట్టుకుని మరీ కీరవాణిని గౌరవించాడని చెప్పాలి.

Related News

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

కొత్త ఉద్యోగంలో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియోతో ఊహించని సర్ప్రైజ్!

Big Stories

Advertisement
×