Balakrishna Update: తాము ఎంతగానో అభిమానించే హీరోలకి చిన్న గాయమైన విల విలలాడిపోతారు అభిమానులు. ఇకతాజాగా నందమూరి బాలకృష్ణకి కూడా షూటింగ్ లో గాయం అయిందన్న సంగతి తెలీడంతో టెన్షన్ లో పడిపోయారు అభిమానులు.ఇక సర్జరీ చేయాల్సిందే అన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో అసలు బాలయ్య బాబు పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్.
చిన్న సర్జరీ చేస్తే సరిపోతుందన్న డాక్టర్స్
అయితే అభిమానులు అంతగా బాధపడాల్సింది ఏమీ లేదని, మోకాలికి తగిలింది మరీ పెద్ద గాయం ఏమీ కాదని, కేవలం ఆయన మోకాలి వద్ద చిన్న మజిల్ టియర్ కి చిన్న సర్జరీ చేస్తే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు.ఆ చిన్న సర్జరీ జరిగితే కేవలం కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే చాలని తేల్చి చెప్పారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అసత్య ప్రచారాలని నమ్మొద్దని,బాలయ్య ఆరోగ్యంపై సరైన అప్ డేట్ మానుండే వస్తుందని క్లారిటీ ఇచ్చారు.దీంతో మా బాలయ్యకి పెద్ద గాయం ఏమీ కాలేదుగా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.
also read :చీరకట్టు.. సిగరెట్.. మద్యం! ఆ ఇమేజ్ నుంచి బయటపడిన బాలీవుడ్ బ్యూటీ !
ఇక బాలయ్య త్వరగానే కోలుకుంటాడన్న వార్తలు రావడంతో మేకర్స్ కూడా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే బాలయ్య వచ్చే గ్యాప్ లో మిగతా సీన్స్ ని చక చక షూట్ చేసి మళ్ళీ బాలయ్య జాయిన్ అయ్యాక సినిమాని పరుగుపెట్టిస్తారన్న మాట.ఇక ముందుగా అనుకున్నట్టే డిసెంబర్ మొదట్లో కాని, చివర్లో కాని వచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.
త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రముఖులు
ఇక బాలయ్య గాయపడ్డాడని తెల్సిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ సహా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ విష్ చేశారు కూడా.
ఇక యాక్సిడెంట్ విషయానికి వస్తే ..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న’NBK111’సినిమా కోసం కాకినాడ పోర్ట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు.ఇక ఈ సీక్వెన్స్ లో మంచు మనోజ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది .ఇక ఎలాంటి డూప్ ని వాడకుండా మనోజ్ తో ఫైట్ సీన్ చేస్తుండగ అకస్మాత్తుగా జారి పడి మోకాలి గాయం కావడంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు బాలయ్య.
ఏది ఏమైనా పెద్దగా గాయాలు ఏమీ కాలేవని, మైనర్ సర్జరీతోనే బయటపడ్డాడని డాక్టర్స్ తెలుపడంతో మళ్ళీ త్వరలోనే మా బాలయ్య తడాకాని బాక్సాఫీస్ వద్ద చూస్తామని మురిసిపోతున్నారట మూవీ లవర్స్ !
also read :దేవుళ్లతో విజయ్, త్రిష పోలికా? రచ్చ ఎక్కిన ఫ్లెక్సీ వివాదం!