Bigg Boss 9:బిగ్ బాస్.. ప్రతి భాష ఇండస్ట్రీలో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న రియాలిటీ షో.. అటు హిందీలో 19వ సీజన్ కొనసాగుతూ ఉండగా.. ఇటు మలయాళంలో ఇటీవలే ఏడవ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కన్నడలో కూడా తొమ్మిదవ సీజన్ కొనసాగుతూ ఉండగా.. ఇటు తెలుగులో కూడా తొమ్మిదవ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 10 వారాలు ఈ వారంతో పూర్తి చేసుకోబోతోంది ఈ సీజన్. ఇప్పటికే ఒకసారి డబుల్ ఎలిమినేషన్ పేరుతో కంటెస్టెంట్స్ ను ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్.. ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ పేరిట మరో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
విషయంలోకి వెళ్తే.. 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామర్నర్స్ ఎంట్రీతో ఈ సీజన్ ప్రారంభమైంది. మధ్యలో దివ్య నిఖిత హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో ఆరు మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎలిమినేషన్స్, సెల్ఫ్ ఎలిమినేషన్ అంటూ ప్రస్తుతం హౌస్ లో కేవలం 11 మంది మాత్రమే కొనసాగుతున్నారు. అయితే కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏకంగా 10 మంది నామినేషన్స్ లోకి రావడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇమ్మానుయేల్ కెప్టెన్ కావడంతో.. మిగిలిన పదిమంది నామినేషన్స్ లోకి వచ్చారు.
అలా నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో.. భరణి శంకర్, డెమోన్ పవన్ , రీతు చౌదరి, తనూజ , దివ్య నిఖిత, గౌరవ్ గుప్త , సంజనా గల్రానీ , కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయక్, సుమన్ శెట్టి ఇలా మొత్తం పదిమంది నామినేషన్స్ లోకి వచ్చేసారు. అటు ఓటింగ్ లో కూడా ఎప్పటిలాగే తనూజ మొదటి స్థానంలో వస్తుంది అనుకున్నారు కానీ ఈ వారం ఓటింగ్లో కళ్యాణ్ మొదటి స్థానానికి చేరుకున్నారు. తనూజ రెండవ స్థానానికి పడిపోయింది. ఎలిమినేట్ అవుతుంది అనుకున్న రీతు చౌదరి మూడవ స్థానానికి రాగా.. రేలంగి మావయ్య గా పేరు తెచ్చుకున్న భరణి నాలుగవ స్థానానికి చేరుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఓట్లు సంపాదించుకోగా లీస్ట్ లో గౌరవ్, నిఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పదిమందిలో ఈరోజు శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా అందులో నిఖిల్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా.. నాల్గవ వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్ లోకి అడుగుపెట్టిన నిఖిల్ శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే ఈ సీజన్ కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉంది.. పైగా పదిమంది ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు అటు ఓటింగ్ కూడా ఎవరికి వేయాలో తెలియని పరిస్థితి ఆడియన్స్ లో ఏర్పడింది. అందుకే ఏకంగా ఇద్దరూ ఎలిమినేట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శనివారం ఎపిసోడ్లో భాగంగా నిఖిల్ ఎలిమినేట్ కాగా రేపు ఆదివారం ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై నిజా నిజాలు తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
also read:Nivetha Pethuraj: అసలు జ్ఞానం లేదు… వారిపై హీరోయిన్ సీరియస్.!