E-Paper
Advertisement

The Paradise: ఊర మాస్ స్టెప్స్‌తో షేర్ ఆగయా.. సాంగ్ ఎలా ఉందంటే?

The Paradise: ఊర మాస్ స్టెప్స్‌తో షేర్ ఆగయా.. సాంగ్ ఎలా ఉందంటే?

The Paradise: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ‘ఆయా షేర్’ (Aaya Sher) సాంగ్ వచ్చేసింది. నాని బర్త్‌డే‌ను పురస్కరించుకుని మంగళవారం (ఫిబ్రవరి 24) ఈ పాటను విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ, ఇప్పటికే సాంగ్ ప్రోమోని వదిలారు. ఈ సాంగ్ ప్రోమో వచ్చిన తర్వాత రకరకాలుగా కామెంట్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander).. ఇంతకు ముందు తను కంపోజ్ చేసిన సాంగ్‌ ట్యూన్‌ని యాజీటీజ్‌‌గా దింపేశాడనేలా టాక్ నడిచింది. ‘కన్మణి రాంబో ఖతీజా’ మూవీలోని ‘డిప్పమ్ డప్పమ్’ సాంగ్ ట్యూన్‌తోనే ‘ఆయా షేర్’ సాంగ్ ఉండటంతో, ఆదిలోనే ఇలాంటి కాపీలేంటి? అంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. కాకపోతే లిరిక్స్ పవర్ ఫుల్‌గా ఉండటంతో.. కాపీ అంశాన్ని ఫ్యాన్స్ కూడా పక్కన పెట్టేశారు.

Also Read- Vijay Rashmika: విజయ్–రష్మిక పెళ్లి చేసుకుంటున్న రిసార్ట్‌లో.. ఒక రోజు ఉండాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఆయా షేర్ అదిరింది

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పవర్ ఫుల్ ట్యూన్‌కు గతంలో సరైన గుర్తింపు రాలేదని ఇలా దింపేశాడో, లేదంటే కావాలనే ఇలా చేశాడో తెలియదు కానీ, లిరిక్స్ రైటర్ కాసర్ల శ్యామ్ కుమార్ తన రచనతో ఈ ట్యూన్‌కు ఊపిరి పోశాడనే చెప్పాలి. పాట స్టార్టింగ్‌లో ‘కెజియఫ్’ ఫీల్‌ని ఇచ్చారు. అనంతరం నాని వేసిన ఊర మాస్ స్టెప్, జడను పట్టుకునే వేసే స్టెప్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అడ్డుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య ఈ పాటకు వోకల్స్ ఇచ్చారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత మ్యాడ్ ఎనర్జీని జోడించింది. పాటకు పాట, డ్యాన్స్‌కు డ్యాన్స్, నాని మ్యానరిజమ్స్, హుక్ స్టెప్స్.. అన్ని కలగలిపి ఈ పాట వినగానే చార్ట్‌బస్టర్ ఫీల్ వచ్చేస్తుంది. ఈ పాటతో సినిమాపై భారీగా అంచనాలు పెరగడం తధ్యం. పాట విడుదలవడం కాస్త ఆలస్యమైంది కానీ, ఫ్యాన్స్ ఎదురు చూపులకు పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా ఈ పాట ఉంది. ఇక నాని ఫ్యాన్స్‌కు అయితే అప్పుడే బ్లాక్ బస్టర్ కొట్టిన ఆనందాన్ని ఈ సాంగ్ ఇచ్చేస్తోంది.

Also Read- Pradeep Ranganathan: రూ. 50 లక్షల నుంచి రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ వరకు.. ప్రదీప్ క్రేజ్ ఇది!

పాన్ వరల్డ్ సినిమాగా..

నాని ఫియర్స్, మాస్సీ అవతార్‌లో ఈ పాటలో బీభత్సం సృష్టించేశారు. కచ్చితంగా ఆయన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోవడం పక్కా అనేలా ఈ సాంగ్ వైబ్ ఉంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు ఘనమైన ఆరంభం ఇచ్చారు మేకర్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాల్, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో ఆగస్ట్ 21న పాన్-వరల్డ్ సినిమాగా ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రానుంది.

Also Read- Thriller movie OTT : కారులో శవాన్ని తీసుకొచ్చే కూతురు.. దాన్ని మాయం చేసే అమ్మ, మైండ్ బ్లాక్ చేసే మూవీ ఇది

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×