Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. కారణం, ఆయన కొట్టే సక్సెస్సే. అవును, ఈయనేం హీరో అనే స్టేజ్ నుంచి, ఈయనతోనే సినిమా చేయాలనే స్థాయికి ప్రదీప్ తన క్రేజ్‌ను పెంచుకున్నారు. వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో సైతం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) పేరు వైరల్ అవుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నాయంటే.. అది, ప్రదీప్ టాలెంట్. హీరోగా, రచయితగా, దర్శకుడిగా.. ఇలా మల్టీ టాలెంట్ ప్రదర్శిస్తూ దూసుకెళుతున్నాడు. ఆయన సినిమాలు సింపుల్‌గా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుండటంతో.. ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రదీప్ రెమ్యునరేషన్ జర్నీకి సంబంధించి సోషల్ మీడియాలో బాగా చర్చలు నడుస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే..
Also Read- Actor Nani: నాని ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన ఉద్యోగం ఇదేనా…ఏం చేశారంటే?
ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ‘కోమలి’ (Komali) అనే చిత్రానికి రైటర్, డైరెక్టర్‌గా వ్యవహరించి రూ. 50 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్.. ‘లవ్ టుడే’ చిత్రానికి రైటర్, డైరెక్టర్‌గానే కాకుండా హీరోగానూ వ్యవహరించి, రూ. 70 నుంచి 80 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఏకంగా రూ. 1.5 కోట్లకు రెమ్యునరేషన్ పెంచారు. ఇక ఇటీవల వచ్చిన ‘డ్రాగన్’ (Dragon), ‘డ్యూడ్’ (Dude) చిత్రాలకు వరసగా రూ. 10 కోట్లు, రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇక ఆయనతో సినిమా చేసేందుకు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బడా బడా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయనకు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, 7 సంవత్సరాల వ్యవధిలో రూ. 50 లక్షల నుంచి రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఆయన చేరుకోవడం విశేషం. ఒక మనిషి సక్సెస్‌కు ఇంతకంటే కొలమానం ఏముంటుంది?
Also Read- Band Melam Teaser: నాకు పెళ్లి చేసేయండి నాన్న..యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బ్యాండ్ మేళం టీజర్
ఆ స్థాయికి చేరినప్పటికీ ప్రదీప్ రంగనాథన్ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉండటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. తన సినిమా ప్రారంభమైనప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చే వరకు అంతా తానై చూసుకోవడంతో పాటు, విడుదలైన తర్వాత కూడా సినిమాను వదిలేయకుండా, థియేటర్స్‌లో ఉన్నన్ని రోజులూ.. సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. తనను నమ్మిన నిర్మాతలకు నష్టం, కష్టం ఉండకుండా చూసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు కాబట్టే.. నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏది ఏమైనా ప్రదీప్ రంగనాథన్‌ది ఇన్‌స్పిరేషనల్ జర్నీ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు.