Collector Santosh: చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత లేకుండా చూసుకోవాలని, ఇతర మౌలిక వసతులన్నీ కల్పించాలని ఆదేశించారు.
ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పాల్గొన్నారు. వీసి అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ పరీక్షలు జరిగే ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులతోపాటు పరీక్షల విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు, సెల్ ఫోన్స్ పరీక్ష కేంద్రాలకు తీసుకు రాకూడదన్నారు. పరీక్షలు జరగడానికి గంట ముందే ఆయా కేంద్రాల్లోని హాల్స్ ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాథమిక చికిత్స, తాగునీరు, టాయిలెట్స్, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రెవెన్యూ , తపాలా, రవాణా, ఆర్టీసీ, ట్రెజరీ, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు కూడా తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించి జిల్లాలో పరీక్షలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఈవో విజయలక్ష్మి, డిఐఈఓ హృదయ రాజు, డిటిఓ వెంకటేశ్వరరావు, డిపిఓ శ్రీకాంత్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mercedes-Benz CLA Electric: బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారు రివీల్, 5 క్రేజీ విషయాలు మీ కోసం!